జయలలిత మృతి, సీల్డ్ కవర్, 50 పేజీల అఫిడవిట్లు ఇచ్చిన శశికళ, మళ్లీ వాదన. ఎవరు!

Posted By:
Subscribe to Oneindia Telugu
  జయలలిత మృతి, సీల్డ్ కవర్, 50 పేజీల అఫిడవిట్లు ఇచ్చిన శశికళ!

  చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ చేస్తున్న మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు వీకే శశికళ న్యాయవాదులు ఎట్టకేలకు అఫిడవిట్లు సమర్పించారు. అయితే తన మీద ఎవరు ఫిర్యాదు చేశారు అనే వివరాలు చెప్పాలని శశికళ మనవి చేశారని ఆమె న్యాయవాదులు జస్టిస్ ఆర్ముస్వామి విచారణకు కమీషన్ కు చెప్పారు.

  న్యాయవాది అరవిందన్

  న్యాయవాది అరవిందన్

  బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళ నటరాజన్ ఆమె న్యాయవాదులతో సీల్డ్ కవర్ లో ఉన్న అఫిడవిట్లను చెన్నైలోని జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషక్ కు సమర్పించారు. దాదాపు 50 పేజీలకు పైగా శశికళ ఇచ్చిన సీల్డ్ కవర్ లోని అఫిడవిట్లను ఆమె న్యాయవాదులు అరవిందన్, ఎన్ రాజా సెంథూర్ పాండియన్ జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ కు సమర్పించారు.

   ఏం జరిగిందంటే !

  ఏం జరిగిందంటే !

  జయలలిత ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆమె మరణించే వరకూ ఏం జరిగింది అనే పూర్తి సమాచారం ఉన్న అఫిడవిట్లను సీల్డ్ కవర్ లో శశికళ తమకు ఇచ్చారని, వాటిని జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ కు సమర్పించామని న్యాయవాదులు అరవిందన్, రాజా సెంథూర్ పాండియన్ మీడియాకు చెప్పారు.

  ఐఏఎస్ అధికారులు

  ఐఏఎస్ అధికారులు

  జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ చేస్తున్న జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ఇప్పటికే ఐఏఎస్ అధికారులు, మాజీ ఐఏఎస్ లు, జయలలితకు వైద్యం చేసిన డాక్టర్లు, శశికళ కుటుంబ సభ్యులు, జయలలిత ఇంటిలో పని చేసిన ఉద్యోగులను విచారణ చేసి వివరాలు సేకరించారు.

  పెన్ డ్రైవ్ లో వీడియో

  పెన్ డ్రైవ్ లో వీడియో

  వీకే శశికళ ఆమె సమీప బంధువు టీటీవీ దినకరన్ దగ్గర ఓ పెన్ డ్రైవ్ ను జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమీషన్ కు పంపించారు. పెన్ డ్రైవ్ లో జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీడియో ఉందని న్యాయవాదులు చెప్పారు.

  చిన్నమ్మ శశికళ డిమాండ్

  చిన్నమ్మ శశికళ డిమాండ్

  జయలలిత మృతిపై తన మీద అనుమానాలు ఉన్నాయని మీకు ఎవరు ఫిర్యాదు చేశారు చెప్పాలని శశికళ మనవి చేశారని, దయచేసి వివరాలు చెప్పాలని ఆమె న్యాయవాదులు జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమీషన్ కు మనవి చేశారు. అయితే విచారణ వివరాలు రహస్యంగా పెట్టాలని జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమీషన్ ఏ విషయం తేల్చలేదని తెలిసింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Lawyers representing expelled AIADMK leader V K Sasikala have requested the one-man commission probing the death of former chief minister J Jayalalithaa to intimate them when the panel summons witnesses for depositions.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి