వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెమన్‌ క్షమాభిక్షపై విచారణ రేపటికి వాయిదా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు, ఉగ్రవాది యాకూబ్‌ మెమన్‌కు క్షమాభిక్షపై విచారణను సుప్రీం కోర్టు మంగళవారం నాటికి వాయిదా వేసింది. మెమన్‌కు ఉరి శిక్ష విధించాల్సిందేనంటూ మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ముఖుల్‌ రోహత్గీ వాదనలు విపించారు.

మంగళవారం పిటిషనర్‌ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. ముంబై పేలుళ్ల ఘటనకు కారకుడైన ఉగ్రవాది మెమన్‌కు సుప్రీం కోర్టు ఉరిశిక్ష విధించింది. జులై 30న నాగ్‌పూర్‌ జైల్లో ఆయనకు ఉరి తీయనున్నారు.

SC to hear Yakub Memon’s plea on Tuesday morning

ఇందుకు మహారాష్ట్ర ప్రభత్వం ఏర్పాట్లు కూడా చేసింది. అయితే యాకూబ్‌ మెమన్‌కు ప్రాణ భిక్ష పెట్టమని, ఉరి శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని ఆతని భార్య సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై సోమవారం విచారణ జరిగిన అనంతరం ఈ మేరకు న్యాయస్థానం వాయిదా వేసింది.

ఇది ఇలా ఉండగా, పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్‌లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 11 మంది మృతి చెందారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

English summary
The Supreme Court on Monday said that the hearing on Mumbai serial blasts convict Yakub Memon's final mercy plea will take place at 10:30 am on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X