ఎంపీ సెక్స్ స్కాండల్ కేసు, వీడియోలు లీక్ చేసిన కింగ్ పిన్ లు వీళ్లే, మంత్రి అనుచరుడు !
హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల పెన్ డ్రైవ్ లీక్ కేసును విచారిస్తున్న సిట్ కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జమీర్ అహ్మద్ ఖాన్ కు అత్యంతం సన్నిహితుడితో సహా ఇద్దరిని అరెస్ట్ చేసింది. ప్రజ్వల్ రేవణ్ణకు చెందిన అశ్లీల వీడియోలపై దర్యాప్తు వేగవంతం చేసిన సిట్ మంగళవారం ఒక్క అడుగు ముందుకు వేసి ఇద్దరిని అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియో విడుదల చేసిన నిందితులు నవీన్ గౌడ, చేతన్‌లను మంగళవారం సిట్ అరెస్టు చేసింది. ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలు బహిరంగంగా విడుదల చేసిన వారిని అరెస్ట్ చేయాలని మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి ఫిర్యాదు చేసిన తరువాత ఈ ఇద్దరిని అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి ఫిర్యాదు చేసిన తర్వాత ఎట్టకేలకు సిట్ అధికారులు అశ్లీల వీడియోలు లీక్ చేసిన వారిని అరెస్ట్ చేశారు.

ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల విడుదలకు కౌంట్ డౌన్ మొదలైయ్యింది అంటూ నిందితుడు నవీన్ గౌడ అతని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. నవీన్ గౌడ చేసిన పోస్టు సోషల్ మీడియాలు దావానలంలా వ్యాపించింది. ఈ విషయంలో భారీగా చర్చ కూడా జరిగింది. హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పోర్న్ వీడియో చూడటానికి ఈ పేజీని ఫాలో అవ్వండి అంటూ నవీన్ అతని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.
అదే ఫేస్‌బుక్ పేజీలో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వీడియోను విడుదల చేయడానికి సమయం దగ్గరపడిందని మరో పోస్ట్ చేశాడు. ఈ పోస్టు గమనించిన జేడీఎస్ ఆ పోస్ట్ స్క్రీన్ షాట్ తీసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు కాగానే నవీన్ గౌడ తన ఫేస్‌బుక్ ఖాతాలోని పోస్టులు డిలీట్ చేశాడు. దీంతో విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు నవీన్ గౌడకు నోటీసు జారీ చేశారు. అయితే విచారణకు హాజరుకాకుండా నవీన్ పరారీలో ఉన్నాడు.
ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు విడుదల చేసిన వ్యక్తిని ఇంకా అరెస్టు చేయలేదని మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. అలాగే అశ్లీల వీడియోను లీక్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్‌డీ కుమారస్వామి నిర్ణయించారు. దీనిపై మాజీ సీఎం కుమారస్వామి న్యాయవాదులతో చర్చలు జరిపారు. ప్రజ్వల్ రేవణ్ణ తాను ఇదే నెల 30వ తేదీన సిట్ ముందు హాజరు అవుతానని వీడియో విడుదల చేశారు. ఇలాంటి సమయంలో ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు లీక్ చేసిన వారిని సిట్ అరెస్టు చేసింది.

ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలు విడుదల చేసిన నవీన్ గౌడ హాసన్ జిల్లా బేలూరు తాలూకాకు చెందినవాడు. సీఎం సిద్దరామయ్యకు అత్యంత సన్నిహితుడు, కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్‌కు నవీన్ గౌడ సన్నిహిత మిత్రుడన్న సంగతి కూడా తెలిసిందే. మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ తో కలిసి నవీన్ గౌడ్ తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రజ్వల్ రేవణ్ణకు చెందిన అశ్లీల వీడియోల కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగించారు.
సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది. వైరల్ అయిన వీడియో ప్రజ్వల్ రేవణ్ణకు చెందినదని పలువురు ఆరోపించారు. ఇది అత్యాచారం కేసు అని కూడా ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆరా తీసేందుకు అందుబాటులో లేకుండా ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు వెళ్లిపోయాడు. అశ్లీల వీడియోల పెన్ డ్రైవ్ లీక్ కావడంతో అందులోని వీడియోలు హల్ చల్ చేస్తుండటంతో ప్రజ్వల్ విదేశాల్లోనే ఉండిపోయాడు. ఇప్పుడు మే 30వ తేదీన తాను సిట్ ముందు హాజరు అవుతానని సోమవారం ప్రజ్వల్ రేవణ్ణ ఓ వీడియో విడుదల చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ వీడియో విడుదల చేసిన మరుసటి రోజు సిట్ ఇద్దరిని అరెస్టు చేసింది.












Click it and Unblock the Notifications