వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి అజంఖాన్ 7 గేదెల చోరీ, వెతికే పనిలో పోలీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Azam Khan
లక్నో: ఉత్తర ప్రదేశ్ సీనియర్ సమాజ్‌వాది పార్టీ నేత అజమ్ ఖాన్ గేదెలను ఎవరో దొంగిలించారు. దీంతో పలువురు పోలీసులు ఆ గేదెలను వెతికే పనిలో పడ్డారట. ఉత్తర్ ప్రదేశ్‌లోని రాంపూర్‌లో గల అజమ్ ఖాన్ ఫాం హౌస్‌లో ఉన్న గేదెలను కొందరు దొంగిలించారు. చుట్టు ఉన్న ఇనుప కంచెను తొలగించి వాటిని తీసుకు వెళ్లారు.

పలువురు పోలీసులు దొంగిలించిన వారిని పట్టుకొని, గేదెలను వెనక్కి తీసుకు వచ్చే పనిలో పడ్డారు. సమీపంలోని మూడు పోలీసు స్టేషన్ల నుండి పోలీసులు వెళ్లి వాటి కోసం గాలిస్తున్నారు. రాంపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సాధనా గోస్వామి ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌కు నేతృత్వం వహిస్తున్నారు.

గేదెలను ట్రేస్ చేసేందుకు స్నిఫ్పర్ డాగ్స్‌ను కూడా ఉపయోగిస్తున్నారు. అజమ్ ఖాన్ ఉత్తర ప్రదేశ్ మైనార్టీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. కాగా, అజమ్ ఖాన్‌కు ఫాం హౌస్ నుండి శనివారం ఏడు గేదెలను ఎత్తుకెళ్లారు. ఆయన ఫామ్ హౌస్ రాంపూర్ జిల్లాలాలోని థనగంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని పసియాపురా గ్రామంలో ఉంది.

గేదెలు దొంగతనానికి గురయ్యాయనే విషయం తెలియగానే రాంపూర్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఫూట్ ఫ్రింట్స్ ఆధారంగా గుర్తించేందుకు విఫలయత్నం చేశారు. కాగా, దొంగిలించిన వారు రాంపూర్ బయటి నుండి వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

English summary
One of Uttar Pradesh's most powerful politicians, Azam Khan, has been robbed of his buffaloes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X