వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జయ మృతిపై ప్రకటన ఏది, ఏన్నో అనుమానాలు, శశికళది ఆవేశం'

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం పైన అధికారిక ప్రకటన ఎందుకు విడుదల చేయలేదో చెప్పాలని డిఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ నిలదీశారు. డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం పైన అధికారిక ప్రకటన ఎందుకు విడుదల చేయలేదో చెప్పాలని డిఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ నిలదీశారు. డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

<strong>ఆర్కే నగర్‌పై శశికళ బడా ప్లాన్.. సీఎంగా..: పళనికి కూడా చెక్!</strong>ఆర్కే నగర్‌పై శశికళ బడా ప్లాన్.. సీఎంగా..: పళనికి కూడా చెక్!

జయ మృతి పైన ప్రకటన ఎందుకు చేయలేదని అఢిగారు. మాజీ ముఖ్యమంత్రి మరణంపై పలు అనుమానాలు కొనసాగుతున్నాయన్నారు. అన్నాదురై, ఎంజీఆర్‌ మరణించినప్పుడు అధికారికంగా ప్రకటనలు చేశారని గుర్తు చేశారు.

అంతా తెలుసు

అంతా తెలుసు

మాజీ సీఎం పన్నీర్ సెల్వం రాజీనామా నుంచి కూవత్తూరులోని రిసార్టులో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను ఉంచిన వరకు ఏం జరిగిందో అందరికీ తెలుసునని చెప్పారు. తొమ్మిది నెలలుగా ప్రభుత్వం పనిచేయలేదన్నారు.

శశికళది ఆవేశం

శశికళది ఆవేశం

జయలలిత సమాధిపై చేతితో బలంగా తట్టి అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ చేసిన శపథాన్ని ఆవేశపూరిత చర్యగా విశ్లేషించారు.

రహస్య ఓటింగ్ నిర్వహించి ఉంటే..

రహస్య ఓటింగ్ నిర్వహించి ఉంటే..

తమిళనాడు అసెంబ్లీలో సీక్రెట్ ఓటింగ్‌ నిర్వహించి ఉంటే పళనిస్వామి ముఖ్యమంత్రి అయి ఉండేవారు కారని స్టాలిన్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22న నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు స్టాలిన్‌ తెలిపారు.

దాడి జరిగింది

దాడి జరిగింది

అసెంబ్లీ సాక్షిగా తన పైన దాడి జరిగిందన్నారు. ప్రభుత్వం ఒక కుటుంబం చేతిలోకి వెళ్లడానికి నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు ఉంటాయని స్టాలిన్ చెప్పారు.

English summary
DMK chief MK Stalin on Mondeay demanded official statement on late cheif Minister Jayalalithaa's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X