వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సునంద హత్య కేసు: ఢిల్లీ పోలీస్‌ల చేతికి కాల్ రికార్డులు

By Pratap
|
Google Oneindia TeluguNews

సిడ్నీ: కాంగ్రెసు నేత శశిథరూర్ భార్య సునంద పుష్కర్ హత్యకు సంబంధించి కీలకమైన ఫోన్ రికార్డు వివరాలు ఢిల్లీ పోలీసుల చేతికి వచ్చాయి. వంద గంటలకు పైగా చేసిన కాల్ రికార్డుల వివరాల కోసం విశ్లేషణకు పంపించారు. వాటి వివరాలు పోలీసుల చేతికి వచ్చాయి. దీంతో దర్యాప్తు వేగంగా ముందుకు సాగుతుందని భావిస్తున్నారు.

సునంద పుష్కర్ సంభాషణలకు సంబంధించిన కీలకమైన వివరాలను మాత్రమే కాకుండా, ఆమె మృతి వెనక గల కారణమేమిటనేది ఆ కాల్ రికార్డుల ద్వారా వెల్లడి కాగలదని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. సునంద పుష్కర్ దేశానికి, విదేశాలకు చెందిన ఎవరెవరితో మాట్లాడారనే విషయాలు వెల్లడి కానున్నాయి. అది దర్యాప్తునకు విశేషంగా తోడ్పడుతాయని భావిస్తున్నారు.

Sunanda Pushkar murder case: Call records arrive

సునంద పుష్కర్ తన భర్త శశిథరూర్‌తోనూ తన కుటుంబ సభ్యులతోనూ ఏం మాట్లాడారనే విషయం ఈ కాల్ రికార్డులు వెల్లడి చేయనున్నాయి. ఇది దర్యాప్తునకు కీలకంగా మరే అవకాశం ఉంది. వాటి ఆధారంగా తదుపరి దర్యాప్తును ఢిల్లీ పోలీసులు సాగించనున్నారు.

తన మరణానికి ముందు ఎవరితో మాట్లాడారనే విషయంపై ఇంకా కొన్ని రహస్యాలు ఉండనే ఉన్నాయి. ఆమె సహాయం కోసం ఓ వ్యక్తిని అడిగినట్లు చెబుతున్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరనేది తెలియడం లేదు. ఆ వివరాలను ఆమె కాల్ రికార్డులు వెల్లడిస్తాయని అంటున్నారు

కాల్ రికార్డులను పరిశీలిస్తున్న పోలీసులు మరోసారి శశిథరూర్‌ను విచారణ నిమిత్తం పిలిచే అవకాశం ఉంది. గతంలో రెండుమార్లకుపైగా పోలీసులు ఆయనను ప్రశ్నించారు. కాల్ రికార్డులను పరిశీలించిన తర్వాత శశిథరూర్‌ను విచారించడానికి ప్రశ్నావళిని రూపొందిస్తారు. ఆ ప్రశ్నావళి సునంద పుష్కర్ కాల్ రికార్డులపై ఆధారపడి ఉంటుంది.

English summary
Crucial phone record details relating to the Sunanda Pushkar murder case has been received by the Delhi police. Several 100 hours of call record records which were sent for analysis has been received by the Delhi police which has turned out to be a boon for the investigating team.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X