Tamil Nadu Poll Survey: తమిళనాడులో షాకింగ్ ఫలితాలు-లోక్ పోల్ తుది సర్వేలో వారే క్లీన్ స్వీప్..!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (tamil nadu assembly election 2026) డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్య గట్టి పోటీ నెలకొందన్న వార్తల నేపథ్యంలో తాజాగా లోక్ పోల్ సంస్ద తమ తుది సర్వే (survey) నిర్వహించింది. ఇందులో ఓటర్లు డీఎంకే, అన్నాడీఎంకే కూటములతో పాటు విజయ్ కొత్త పార్టీ టీవీకే భవిష్యత్తు కూడా ఏంటనేది తేల్చేశారు. ఈ నెల 23న జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించిన లోక్ పోల్ సర్వేలో రాష్ట్రంలో ఈసారి పలు ఆశ్చర్యకర ఫలితాలు రావడం ఖాయమని తేలిపోయింది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు మరోసారి డీఎంకే కూటమికే జై కొడుతున్నట్లు లోక్ పోల్ తుది సర్వేలో తేలింది. ఈసారి డీఎంకే కూటమి 180 నుంచి 185 సీట్లు సాధించి క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని లోక్ పోల్ తేల్చేసింది. విపక్ష అన్నాడీఎంకే-బీజేపీ కూటమి కి కేవలం 40 నుంచి 44 సీట్లు మాత్రమే రాబోతున్నట్లు ఈ సర్వేలో నిర్ధారణ అయింది. విజయ్ కొత్త పార్టీ టీవీకేకు కూడా కేవలం 8-10 సీట్లు మాత్రమే లభిస్తాయని ఈ సర్వేలో తేలింది.

TAMIL NADU LANDSLIDE Final Poll Predicts DMK Alliance to Win Massive 180 plus Seats

ఈసారి డీఎంకే కూటమి 40 శాతం ఓట్లు సాధించబోతున్నట్లు లోక్ పోల్ తెలిపింది. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి 31.5 శాతం ఓట్లు, టీవీకే 22.5 శాతం ఓట్లు లభించబోతున్నట్లు వెల్లడించింది. మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ కు 43 శాతం మంది మద్దతిస్తున్నట్లు సర్వేలో తేలింది. అన్నాడీఎంకే నేత పళనిస్వామిని సీఎంగా కోరుకుంటున్నవారు 22 శాతం ఉన్నారు. అలాగే విజయ్ ను సీఎంగా కోరుకుంటున్న వారు 28 శాతం ఉన్నట్లు సర్వేలో తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+