షాక్: జియో దెబ్బకు 600 ఉద్యోగులకు టాటా టెలిసర్వీసెస్ ఉద్వాసన?

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: రిలయన్స్ జియో రాకతో కస్టమర్లకు ప్రయోజనాలు ఏమో కానీ, ఉద్యోగుల కంపెనీల పొట్టను కొడుతోంది. టాటా టెలిసర్వీసెస్ కు భారీ నష్టాలు రావడంతో ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు కంపెనీ నుండి సుమారు 600 మందిని తొలగించింది.

టెలికం మార్కెట్ లో నెలకొన్న తీవ్రమైన పోటీని తట్టుకోలేక 600 మంది ఉద్యోగులను తీసివేసినట్టు తెలిసింది. సేల్స్, ఇతర సంబంధిత విభాగాల్లో పనిచేసే 600 మందిపై లేఆఫ్ ప్రభావం పడనుందని ఇద్దరు కంపెనీకి చెందిన వ్యక్తులు చెప్పారు.

ఉద్యోగులకు సెవరెన్స్ ప్యాకెట్ కూడ కంపెనీ ఆఫర్ చేసిందని తెలిపారు. ఒక్కో ఏడాది సర్వీసుకు నెల వేతనాన్ని ఇవ్వాలని కంపెనీ నిర్ణయించినట్టు సమాచారం.అయితే దీనిపై టాటా టెలిసర్వీసెస్ ఇంకా స్పందించలేదు.

Tata Teleservices fires 500-600 employees

టెలికం ఇండస్ట్రీకి ఇది చాలా చాలెంజింగ్ సమయమని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. రిలయన్స్ జియో ఎంట్రీతో నెలకొన్న తీవ్రమైన టారిఫ్ వార్ కారణంగా టెలికం ఇండస్ట్రీ ఈ ఉద్యోగాల కోతను భరించాల్సి వస్తోందన్నారు.

జియో సంచలన ఆఫర్లు ఉద్యోగుల పొట్టను కొడుతున్నాయని ఇప్పటికే చాలా రాజుల నుండి వాదనలు విన్పిస్తున్నాయి. మార్కెట్లోకి వచ్చిన జియో ఇప్పటికే టెలికం ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేసింది.

జియో సంచలన ఆఫర్లు ఉద్యోగుల పొట్టను కొడుతాయని ఇప్పటికే చాలా రోజుల నుండి వాదనలు విన్పిస్తున్నాయి. మార్కెట్లోకి వచ్చిన జియో ఇప్పటికే టెలికం ఇండస్ట్రీ రుణం దాదాపు 4.6 కోట్లకు ఎగిసింది. దేశవ్యాప్తంగా 19 టెలికం సర్కిళ్ళలో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. జీఎస్ఎం, సీడీఎంఏ, 3 జీ ఫ్లాట్ ఫామ్స్ టాటా టెలిసర్వీసెస్ వైర్ లెస్, వైర్ లెస్ నెట్ వర్క్స్ ను తన కస్టమర్ల కోసం ఆఫర్ చేస్తోంది.

ట్రాయ్ అంచనాల ప్రకారంగాను ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి కంపెనీ మొబైల్ చందాదారుల బేస్ 51.2 మిలియన్ కు పెరిగింది. దీంతో మొత్తంగా కంపెనీ మొబైల్ చందాదారుల బేస్ 1.16 బిలియన్ కంటే ఎక్కువగా ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tata Teleservices has fired between 500 and 600 employees to tide over difficult times in the hyper-competitive telecom market.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి