వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ హోర్డింగ్ కూలి సాఫ్టువేర్ ఇంజనీర్ మృతి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Techi found dead
హైదరాబాద్: హైటెక్ సిటీ సమీపంలోని గచ్చిబౌలి చౌరస్తా వద్ద ద్విచక్ర వాహనం పైన వెళ్తున్న ఓ సాఫ్టువేర్ ఇంజనీర్ భారీ హోర్డింగ్ కూలి మృతి చెందారు. ఈ ప్రమాదంలో అతను అక్కడికి అక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికుల సహాయంతో పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుడి వద్ద దొరికిన ఐడీ కార్డు ఆధారంగా అతను ఓ సాఫ్టువేర్ కంపెనీలో ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు కూకట్‌పల్లి నివాసి అని, అతడి బంధువులకు సమాచారం అందజేసినట్లు తెలిపారు.

హోర్డింగ్ ఏర్పాటులో లోపం కారణంగానే కూలిందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జీహెచ్ఎంసీ అధికారుల పైన కేసు నమోదు చేశారు. గత వారం హిమయత్ నగర్‌లోని తెరిచి ఉంచిన మ్యాన్ హోల్‌లో పడి ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే.

గుండెపోటుతో ఏఆర్‌ కానిస్టేబుల్‌ మృతి

జన్మభూమి-మా ఊరు సభకు వచ్చిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఆశోక్ కుమార్‌(27) గుండెపోటుతో శనివారం మృతి చెందాడు. విజయనగరం జిల్లా వేపాడ మండలం బానాదిలో ఈ కార్యక్రమానికి ఏఆర్‌ ఏఎస్‌ఐ మల్లేశ్వర రావు ఆధ్వర్యంలో అశోక్‌ కుమార్‌ విధులకు హాజరయ్యారు.

మధ్యాహ్నం భోజనం చేసేందుకు సహచర కానిస్టేబుళ్లతోపాటు అశోక్‌కుమార్‌ వల్లంపూడి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఆ సమయంలో ఛాతీలోనూ, వీపువెనుక చిన్నగా నొప్పి వస్తున్నట్లు సహచరులకు చెప్పడంతో వారు తొలుత ఆ భాగంలో మర్దన చేసి మందులు తీసుకోచ్చేందుకు వెళ్లారు.

వారు వచ్చేలోపే అశోక్ కుమార్‌ అపస్మారక స్థితికి చేరుకోవడంతో శృంగవరపుకోట సామాజిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అశోక్ కుమార్‌ చనిపోయినట్లు వైద్యుడు చారి గుర్తించారు. ఈ జిల్లాలో జన్మభూమి సభలు సాదాసీదాగా జరిగాయి.

English summary
Techi found dead in on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X