ఫోన్ ట్యాపింగ్ నిజమే: ఎందుకు చేస్తున్నారో: మంత్రి డీకే శివకుమార్, టీవీ చానల్ కు వార్నింగ్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది నిజమే, దానిని ఎలా ఎదుర్కొవాలో నాకు బాగా తెలుసని కర్ణాటక విద్యుత్ శాఖా మంత్రి డీకే. శివకుమార్ అన్నారు. అయితే నా ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేస్తున్నారు ? ఎవరు చేస్తున్నారు ? అనే విషయంపై తాను మాట్లాడనని మంత్రి డీకే. శివకుమార్ చెప్పారు.

మంగళవారం విదాన సౌధలో మంత్రి డీకే. శివకుమార్ ను మీడియా పలు ప్రశ్నలు అడిగింది. ఆదాయపన్ను శాఖ అధికారులు మిమ్మల్ని ఏలా విచారణ చేశారు అని మీడియా ప్రశ్నించింది. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఇలాంటివి తనకు మామూలు అయ్యాయని డీకే. శివకుమార్ చెప్పారు.

Telephone tamping is going on is true says Karnataka minister DK Shivakumar

గతంలో ఇలాంటి ఘటనలు ఎదుర్కొన్నానని, ఇక ముందు ఎదుర్కొవడానికి తాను సిద్దంగా ఉన్నానని మంత్రి డీకే. శివకుమార్ వివరించారు. ఐటీ అధికారులు విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరౌతానని, అందులో ఎలాంటి సందేహం వద్దని మంత్రి డీకే. శివకుమార్ చెప్పారు.

ఆడిటర్ లేకుండా డీకే శివకుమార్, ఆయన కుటుంబ సభ్యులు విచారణకు హాజరుకావాలని ఆదాయపన్ను శాఖ అధికారులు సూచించారు. ఆదాయపన్ను శాఖ అధికారులు అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలి అంటూ ఆడిటర్లు డీకే. శివకుమార్ కుటుంబ సభ్యులకు పాఠాలు చెప్పారని ఓ టీవీ చానల్ సోమవారం వార్తలు ప్రసారం చేసింది.

ఈ విషయంపై డీకే. శివకుమార్ మాట్లాడుతూ ఆ టీవీ చానల్ ప్రతినిధి ఇక్కడికి ఏమైనా వచ్చారా ? అంటూ ఆరా తీశారు. టీవీ చానల్స్ వాస్తవాలు ప్రసారం చెయ్యాలని, ఊహించుకుని నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదని ఆ టీవీ చానల్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. తాను కనకపుర గ్రానైట్ లాంటి వాడిని, అనవసరంగా ఇలాంటి వార్తలు మరోసారి ప్రసారం చేస్తే తాను చూస్తూ సహించనని, నన్ను రెచ్చగొడితే పరిస్థితులు వేరుగా ఉంటాయని మంత్రి డీకే. శివకుమార్ సదరు టీవీ చానల్ యాజమాన్యాన్ని హెచ్చరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telephone tamping is going on is true says Karnataka minister DK Shivakumar.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి