విజయ్ సంచలన నిర్ణయం.. తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ !!
తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో త్రిముఖ పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న M. K. Stalin నేతృత్వంలోని డీఎంకే, ప్రధాన ప్రతిపక్ష అన్నాడీఎంకే, అలాగే సినీ నటుడు Vijay స్థాపించిన Tamilaga Vettri Kazhagam (టీవీకే) మధ్య పోటీ ఉత్కంఠ రేపుతోంది. కాగా సినీ రంగంలో స్టార్‌గా ఉన్న విజయ్ రాజకీయాల్లోకి రావడం తమిళనాడులో గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్నారు. ఆయనకు ఉన్న యువత ఫాలోయింగ్ ఇప్పుడు ఓటు బ్యాంక్‌గా మారే అవకాశం ఉంది. "సిస్టమ్ మారాలి" అనే నినాదంతో ముందుకు సాగుతున్న విజయ్, ప్రజల్లో కొత్త ఆశలు కలిగిస్తున్నారు. ముఖ్యంగా అవినీతి, వారసత్వ రాజకీయాలపై ఆయన తీసుకుంటున్న స్టాండ్ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
రెండు స్థానాల నుంచి విజయ్ పోటీ..
ఇక ఈ ఎన్నికల్లో విజయ్ స్వయంగా బరిలోకి దిగుతూ చెన్నైలోని పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ రెండు ప్రాంతాలు కూడా పట్టణ ఓటర్లు, యువత ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలు కావడంతో, ఈ నిర్ణయం వ్యూహాత్మకంగా తీసుకున్నదిగా విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో టీవీకే పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం ఉంది.

అలానే టీవీకే పార్టీ అభ్యర్థుల ఎంపికలో సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా వ్యవహరిస్తోంది. డబ్బు, ప్రభావం కంటే సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన, చదువుకున్న యువతకు ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజలకు సేవ చేయాలనే అభిలాష ఉన్నవారికి మాత్రమే టికెట్లు ఇస్తున్నట్లు విజయ్ స్పష్టం చేశారు. ఇది రాజకీయాల్లో కొత్త సంస్కృతికి నాంది పలుకుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
డ్రైవర్ కుమారుడికి టికెట్..
ఈ క్రమంలోనే విజయ్ తీసుకున్న ఒక నిర్ణయం అత్యంత చర్చనీయాంశంగా మారింది. గత 30 ఏళ్లుగా తన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. చెన్నైలోని విరుగంపాక్కం నియోజకవర్గం నుంచి అతడిని అభ్యర్థిగా ప్రకటించారు. సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తికి అవకాశం ఇవ్వడం ద్వారా విజయ్ తన పెద్ద మనసును చాటుకున్నారు.
అయితే శబరినాథన్ పేరును ప్రకటించిన వెంటనే స్టేజీపై భావోద్వేగ సన్నివేశం చోటుచేసుకుంది. రాజేంద్రన్, ఆయన కుమారుడు కన్నీళ్లు పెట్టుకుని విజయ్‌ను హత్తుకున్నారు. ఆయన కాళ్లకు నమస్కరించారు. ఈ ఘటన అక్కడున్న నేతలు, కార్యకర్తలను కదిలించింది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతూ విజయ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
నమ్మిన బంటు కోసం.. వారసుడికి అండగా!
— oneindiatelugu (@oneindiatelugu) March 29, 2026
డ్రైవర్ కొడుకు శబరినాథ్కు రాజకీయ సీటు కేటాయించిన విజయ్#Rajendran #Sabarinath #TVKVijay #TVKPeopleCandidates #PoliticsToday #Tamilnadu #OITelugu pic.twitter.com/ozqg5a1ja6
మరోవైపు టీవీకే తీసుకుంటున్న నిర్ణయాలు ఈసారి ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. యువత ఓటును ఆకర్షించడం, యాంటీ-ఇంకంబెన్సీ వేవ్‌ను ఉపయోగించుకోవడం, కొత్త రాజకీయ సంస్కృతి తీసుకురావడం వంటి అంశాలు టీవీకేకు ప్లస్ అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇక తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి. మరి ఈసారి ఎన్నికలు కేవలం అధికార పోటీ కాకుండా, కొత్త ఆలోచనలు గెలుస్తాయా లేదా సంప్రదాయ రాజకీయాలే కొనసాగుతాయా అన్నదానికి సమాధానం ఇవ్వనున్నాయి
-
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రెండు చోట్ల విజయ్ పోటీ- టీవీకే జాబితా విడుదల: ఒక్క ఛాన్స్ ప్లీజ్ -
TN Election Survey: గెలిచేది ఆ పార్టీయేనా? జ్యోతిష్యుల షాకింగ్ జోస్యం! -
తెరపై స్టార్ హీరో + దర్శకుడు: విజయ్ వద్దనుకున్న చోట.. -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
వీళ్లా ఆలయ అధికారులు.. శ్రీరామనవమి నాడే "అశ్లీల నృత్యాల" బాగోతం !! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!












Click it and Unblock the Notifications