వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థర్డ్ వేవ్ ముప్పు: 6 రాష్ట్రాలకు ఆక్సిజన్ బెడ్స్, కేంద్రం అలర్ట్

|
Google Oneindia TeluguNews

కరోనా అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇక థర్డ్ వేవ్ అంటేనే గజగజ వణికే పరిస్థితి. మూడో వేవ్ గురించి రోజుకో కథనం వస్తోంది. పిల్లలపై ఇంఫెక్ట్ చూపిస్తోందని నిపుణులు చెబుతోన్న సంగతి తెలిసిందే. అయితే థర్డ్ వేవ్ ఏ క్షణమైనా ముంచుకొచ్చే ప్రమాదం ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. థర్డ్ వేవ్ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపించి.. ఆక్సిజన్ బెడ్స్ అవసరమైతే వాటి కొరత లేకుండా చూసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అత్యవసర ఆరోగ్య ప్యాకేజ్‌లో భాగంగా ఆమోదించిన పీడియాట్రిక్ ఆక్సిజన్‌ బెడ్స్‌లో యాభై శాతం బెడ్స్‌ను ఆరు రాష్ట్రాలకు కేటాయించనుంది.

గ్రామీణ ప్రాంతాల్లో..

గ్రామీణ ప్రాంతాల్లో..

సెకండ్ వేవ్ సమయంలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా కరోనా బారిన పడటంతో.. ఈ పీడియాట్రిక్ బెడ్స్‌ను ఆయా రాష్ట్రాల్లో రూరల్ ఏరియాలకు కేటాయిస్తున్నారు. మొత్తం 75 వేల 218 పీడియాట్రిక్ ఆక్సిజన్ బెడ్స్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. వాటిలో 60 శాతం బెడ్స్‌ ఈ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, అసోం, జార్ఖండ్ రాష్ట్రాల్లో జిల్లా స్థాయిల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కొరత కారణంగా మొదటి, సెకండ్ వేవ్‌లో కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయి..

ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయి..

ఆక్సిజన్ బెడ్స్‌ అందక ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాంటి పరిస్థితులు థర్డ్ వేవ్ సమయంలో రిపీట్ కాకుండా చూసేందుకు కేంద్రం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా చిన్నారులు కరోనా బారిన పడితే హెల్త్ కేర్ సిస్టమ్‌ వేగంగా స్పందించేలా చర్యలు తీసుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల అధికారులతో సమీక్ష నిర్వహించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.. 19 వేల 30 పీడియాట్రిక్ ఆక్సిజన్ బెడ్స్‌, 10 వేల 428 పీడియాట్రిక్ ఐసీయూ బెడ్స్‌ ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చింది. వీటిని ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రత్యేకంగా నిధులను సమకూర్చుతుంది. ఈ ప్యాకేజ్‌లో భాగంగా కొన్ని రాష్ట్రాలు జిల్లా స్థాయిలో వెయ్యికి పైగా పీడియాట్రిక్ ఆక్సిజన్ బెడ్స్‌ను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు దొరుకుతుంది.

తెలంగాణలో ఇలా..

తెలంగాణలో ఇలా..

తెలంగాణలో నిన్న కొత్తగా 427 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మ‌రో ఇద్దరు కోవిడ్ బాధితులు మృతిచెందారు. మరో 1843 రిపోర్టులు రావాల్సి ఉంది. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,51,716కి చేరింది.ఇప్పటివ‌ర‌కు క‌రోనాతో మృతి చెందినవారి సంఖ్య 3,838కి చేరింది. తాజాగా మరో 609 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 6,40,065కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,812 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

 ఏపీలో ఇలా

ఏపీలో ఇలా


ఏపీలో గత 24 గంటల వ్యవధిలో 73,341 నమూనాలను పరీక్షించగా.. 1746 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది. తాజాగా నమోదైన 1746 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,90,656కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 20 మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో నలుగురు చొప్పున, నెల్లూరులో ముగ్గురు, తూర్పుగోదావరి, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అనంతపురం, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,615 మృతి చెందారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1648 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 19,58,275కి చేరింది. రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 18,766 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,55,26,861 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 304 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 20 మంది చొప్పున కరోనా బారినపడ్డారు.

 కరోనా ఇంఫాక్ట్..

కరోనా ఇంఫాక్ట్..

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

 ఫంగస్ బెడద

ఫంగస్ బెడద

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. డిసిషన్ తీసుకోవాల్సి ఉంది.

English summary
third wave:central government plan to pediatric beds to 6 states. the states are ap, up, bihar, assam,odisha, jharkhand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X