వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరి సమక్షంలో యాకుబ్ మెమన్‌ను ఉరి తీశారు...!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

1993 ముంబై వరుస పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్‌కు ఈరోజు ఉదయం 6.43 గంటలకు ఉరిశిక్షను అమలు చేశారు. నాగ్‌పూర్‌లోని సెంట్రల్ జైలు అధికారులు అతడిని ఉరి తీశారు. రెండు నిమిషాల్లో ఉరిశిక్షను అమలు చేసినట్లు తెలుస్తోంది. ఉరి తీసిన తర్వాత యాకుబ్ మెమెన్ మరణించినట్లుగా వైద్యులు సరిగ్గా ఉదయం 7.01 గంటలకు ప్రకటించారు.

అయితే ఎవరెవరి సమక్షంలో యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేశారో చూద్దాం. ఐదుగురు అధికారుల సమక్షంలో యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్ష అమలైంది. యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్షను ఖరారు చేసిన టాడా కోర్టు న్యాయమూర్తి, నాగ్‌పూర్ జైలు సూపరింటెండెంట్, మహారాష్ట్ర సీఎం కార్యాలయ అధికారి, డీఐజీ స్థాయి పోలీసు అధికారి, యాకుబ్‌కు వైద్య చికిత్స చేసిన వైద్యుల సమక్షంలో ఉరి శిక్ష అమలైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఆసమయంలో ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నట్లు సమాచారం. ఉరిశిక్ష అమలు చేసే సమయంలో యాకుబ్ మెమన్‌కు సంబంధించిన ముగ్గురు కుటుంబ సభ్యలను కూడా అనుమతించినట్టు తెలుస్తోంది. సోదరుడు సులేమాన్, భార్య రహిన్ ఉన్నట్లు సమాచారం.

Three members of Yakub Memon's family to attend hanging

ఉదయం ఆరున్నర గంటలకు ఆయనకు కిచిడీ పెట్టినట్లు తెలుస్తోంది. తనకు ఇష్టమైన కిచిడీని మెమెన్ అడిగినట్లు తెలుస్తోంది. దాన్ని కూడా ఆయన కేవలం సగం మాత్రమే తిన్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు మెమెన్‌ను జైలు సిబ్బంది నిద్రలేపి, స్నానం చేయించారు. తనకు ఇచ్చిన కొత్త దుస్తులను ధరించాడు.

ఆ తర్వాత కొద్ది నిమిషాల పాటు అతను మౌనంగా కూర్చున్నట్లు తెలుస్తోంది. అనంతరం ‘నా కూతురును ఒకసారి కలవాలి' ఇది 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల నేరస్తుడు యాకుబ్ మెమన్ చివరి కోరికలలో ఒకటి. అంతేగాక, తన ఉరిశిక్ష రాజకీయం చేయబడిందని యాకుబ్ మెమన్ చెప్పినట్లు తెలిసింది.

English summary
At least three members of 1993 Mumbai serial bomb blasts convict Yakub Memon's family have been permitted to attend his hanging, sources said on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X