ఐఐటి మద్రాసులో ఇద్దరు మహిళల ఆత్మహత్య

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ఐఐటి మద్రాసు క్యాంపస్‌లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. తమ గదుల్లో ఉరేసుకుని విజయలక్ష్మి, మహేశ్వరి అనే ఇద్దరు మహిళలు బలవన్మరణానికి పాల్పడ్డారు. విజయలక్ష్మి ప్రొఫెసర్ గణేశన్ భార్య కాగా, మహేశ్వరి (34) రిసెర్చ్ స్కాలర్.

 Two women commit suicide inside IIT Madras campus

రిసెర్చ్ స్కాలర్ మృతికి ఐఐటి మద్రాసు విశ్వవిద్యాలయం సంతాపం తెలిపింది. మృతురాలి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహేశ్వరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. విజయలక్ష్మి మృతిపై వివరాలు తెలియాల్సి ఉంది.

రిసెర్చ్ స్కాలర్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ విశ్వవిద్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మహేశ్వరి తన హాస్టల్‌ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారంనాడు ఈ రెండు ఆత్మహత్యల సంఘటనలు చోటు చేసుకున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two women commited suicide inside IIT Madras campus on Thursday, according to reports in NDTV. One was a researcher and the other was wife of a professor.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి