రాష్ట్రపతి ఎన్నికల్లో కొత్త విధానం: ఆ పెన్నుతో ఓటు వేస్తేనే చెల్లుతాయి

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. గతంలోలా కాకుండా ఈసారి ఎన్నికల ఓటింగ్ కోసం సరికొత్త పెన్నులు, వేర్వేరు బ్యాలెట్లను ఉపయోగిస్తున్నారు.

ఎంపీలకు ఆకుపచ్చ, ఎమ్మెల్యేలకు గులాబీ రంగులో ఉండే బ్యాలెట్ పేపర్లను అందుబాటులో ఉంచారు. గత ఏడాది రాజ్యసభ ఎన్నికల సందర్భంగా హర్యానాలో ఇంకు విషయంలో వివాదం తలెత్తింది.

రాష్ట్రపతి ఎన్నిక: ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 పాయింట్లు

Unique, numbered pens to be used for presidential poll

ఈ కారణంగా ఈసారి ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక పెన్నులను సిద్ధం చేశారు. ఈ పెన్నుల్లోని సిరా ఊదా రంగులో ఉంటుంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లే సమయంలో వారి వద్ద ఉన్న పెన్నులు తీసుకొని ఈ కొత్త పెన్నులను వారికి ఇస్తారు.

Presidential Elections : BJP pitches Ram Nath Kovind for President's post | Oneindia News

ఓటు వేశాక మళ్లీ తీసుకుంటారు. కేవలం ఈసీ ఇచ్చే ప్రత్యేక పెన్నులతో ఓటు వేస్తేనే చెల్లుతాయి. ఈసీకి సిరా సరఫరా చేసే మైసూరు కర్మాగారమే ఈ పెన్నులను సమకూర్చింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Election Commission will use unique, serial-numbered special pens with violet ink for marking ballots in the Presidential poll today. Marking the ballot with personal pens, which will be collected from the voting MPs/MLAs by a polling staff before they enter the voting chamber, may lead to invalidation of the vote, the EC said on Sunday.
Please Wait while comments are loading...