వధువు కావలెను అంటూ ఏకంగా పోస్టర్లు..నాలుగేళ్ళుగా పెళ్లికోసం బ్రహ్మచారి కష్టాలు.. వైరల్!!

పెళ్లి కావడం లేదని ఓ యువకుడు వినూత్న చర్యకు దిగాడు. తనకు భార్య కావాలంటూ పోస్టర్లను ముద్రించి అక్కడక్కడా అంటించాడు. ప్రస్తుతం పెళ్లి కోసం ఆ యువకుడు అంటించిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పెళ్ళికూతురు కావాలని మధురై యువకుడి పోస్టర్లు

పెళ్ళికూతురు కావాలని మధురై యువకుడి పోస్టర్లు


తమిళనాడులోని మధురైకి చెందిన 27 ఏళ్ల యువకుడు గత నాలుగేళ్లుగా వధువు కోసం వెతుకుతున్నాడు.అయితే అతను ఎన్ని సంబంధాలు చూసినా అతనికి వివాహం కుదరడం లేదు. దీంతో అతను ఇప్పుడు వధువు కోసం మరొక ప్రత్యేకమైన మార్గం ఎంచుకున్నాడు.ఆ యువకుడు తన పెళ్లికి సంబంధించిన పోస్టర్లను నగరమంతా అంటించాడు.మదురై కూడలిలో 'నాకు పెళ్లికూతురు కావాలి' అంటూ సదరు వ్యక్తి పోస్టర్లు అంటించాడు.

పెళ్ళికూతురి కోసం వెతుకులాట.. అన్ని డీటెయిల్స్ తో పోస్టర్లు

పెళ్ళికూతురి కోసం వెతుకులాట.. అన్ని డీటెయిల్స్ తో పోస్టర్లు


మధురై లో ఉంటున్న జగన్ అనే యువకుడు ఆ పోస్టర్లలోతన పూర్తి వివరాలను, తన సంపాదన వివరాలను కూడా ఇచ్చారు. తన జీతం రూ.40,000 అని కూడా పోస్టర్ లో ఉంది. అంతేకాదు తన వయసు, తనకు ఉన్న ఆస్తుల వివరాలు కూడా పోస్టర్లో ముద్రించారు. పోస్టర్‌లో తన గురించిన సమాచారం ఇస్తూ.. తాను బీఎస్సీ ఐటీ చేశానని జగన్ చెప్పారు. ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్నానని పేర్కొన్నాడు. మేనేజర్‌గా ఉండడంతో పాటు పార్ట్‌టైమ్ జాబ్ కూడా చేస్తున్నానని కూడా జగన్ పేర్కొన్నాడు.

నాలుగేళ్ళుగా అమ్మాయి కోసం అన్వేషణ.. నచ్చిన చిన్నది దొరకక వధువు కావాలని పోస్టర్

నాలుగేళ్ళుగా అమ్మాయి కోసం అన్వేషణ.. నచ్చిన చిన్నది దొరకక వధువు కావాలని పోస్టర్

తన పోస్టర్ చూసిన వెంటనే ఎవరైనా అమ్మాయి తన పట్ల ఆకర్షితులై పెళ్లికి ముందుకు వస్తుందని జగన్ భావిస్తున్నాడు.ఉద్యోగం వచ్చినప్పటి నుంచి జగన్ తాను పెళ్లి చేసుకోవాలని పెళ్లికూతురు కోసం వెతుకుతున్నాడు.అయితే నాలుగేళ్లు గడిచినా అతనికి ఇష్టమైన అమ్మాయి దొరకలేదు.దీంతో విసిగిపోయిన జగన్ ఆ తర్వాత కొత్త ఆలోచన చేసి తన వివాహానికి వధువు కావలెను అంటూ పోస్టర్‌ను ముద్రించి మధురైలోని ప్రధాన కూడలిలో పెట్టాడు.

పెళ్లి పోస్టర్ లతో అయినా యువకుడికి పెళ్ళికూతురు దొరుకుతుందా ?

పెళ్లి పోస్టర్ లతో అయినా యువకుడికి పెళ్ళికూతురు దొరుకుతుందా ?

జగన్‌ తన పెళ్లికి అమ్మాయి కోసం అనేక ఏజెన్సీలలో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాడు.కానీ మ్యాట్రిమొనీల యజమానులు డబ్బులు తీసుకుని జగన్ కు హామీలు మాత్రమే ఇచ్చారు. ఎవరూ తనకు మంచి సంబంధాన్ని కుదర్చలేదనిపెళ్లి ఏజన్సీ మధ్యవర్తులు అతడిని మోసం చేశారని చెబుతున్నాడు.దీంతో విసిగి వేసారిన జగన్ ఇప్పుడు పెళ్లి కోసం ఏకంగా పోస్టర్లు వేశారు. మరి ఈ పెళ్లి పోస్టర్లతోనైనా సదరు యువకుడికి పెళ్లి చేసుకోవడానికి నచ్చిన యువతి లభిస్తుందో లేదో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+