
VIRAL:ఏం.. కోతి, పోల్ మీద స్టెప్పులా..? వావ్.. వైరల్
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచం నలుమూలల్లో ఏం జరుగుతున్న ఇట్టే తెలిసిపోతుంది. దానికి తగినట్టు అలాంటి వీడియోలు ట్రోల్ అవుతున్నాయి. కోతి.. పేరుకు తగినట్టు దాని చేష్టలు ఉంటాయి. అవును ఓ కోతి పోల్ ఎక్కి మరీ డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నెటిజన్లు అయితే తెగ కామెంట్లు చేస్తున్నారు.
ఓ పోల్ ఉంది. దాని మీదకు కోతి ఎక్కింది. దాని చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేసింది. చాలా చక్కగా అదీ తిరిగింది. కానీ పడిపోలేదు. ఆ వీడియోను చూసి నెటిజన్లు షాక్ తిన్నారు. అవును.. పోల్ మీద డ్యాన్స్ ఎలా చేయాలో నేర్చుకుని మరీ చేసినట్టు ఉంది. అనుభవం రంగరించి మరీ స్టెప్పులు వేసింది. ఇంకేముంది ఆ వీడియో నెట్టింట హల్ చల్ అవుతుంది.

నెటిజన్లు నవ్వుతూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఎమోజీలు పెట్టి మరీ విష్ చేస్తున్నారు. ఇన్ స్టా పేజీలో గల మంకీ ప్రీసియస్ 1లో వీడియో పోస్ట్ చేశారు. దానికి డ్యాన్సింగ్ షో అని క్యాప్షన్ పెట్టారు. ఆ వీడియో ఇప్పటికే 1.1 మిలియన్ చాలా సార్లు చేశారు. 58 వేల లైకులు కూడా కొట్టారు. ఎందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.
కోతి అంటే.. అలాంటి పనులే చేస్తుందని అంతా అనుకుంటారు. అయితే కొన్ని కొన్ని చక్కని పనులు చేస్తాయి. మిగతా యానిమల్స్‌కు స్పూర్తిగా నిలుస్తాయి. ఈ కోతి అయితే బ్రేక్ డ్యాన్సే చేసింది.