Wife: డ్రగ్స్ తో ఇంజక్షన్ వేసి నవవధువును చంపిన మేల్ నర్స్, ఆసుపత్రిలో మేడమ్ తో రొమాన్స్!
పూణే: ప్రముఖ ఆసుపత్రిలో యువకుడు మేల్ నర్స్ గా ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు చూపించిన యువతిని మేల్ నర్సు వివాహం చేసుకున్నాడు. ఆసుపత్రి సమీపంలోనే భార్యతో కాపురం ఉంటున్నాడు. రాత్రి భార్య ఆత్మహత్యాయత్నం చేసి తీవ్ర అస్వస్థతకు గురైయ్యిందని మేల్ నర్స్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. మేల్ నర్సు భార్యను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయిందని చెప్పారు. భార్య అంత్యక్రియలు చెయ్యడానికి ఏర్పాట్లు చెయ్యాలని మేల్ నర్స్ అతని బంధువులకు ఫోన్ చేశారు. పోలీసుల ఎంట్రీతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.

ఐదు నెలల క్రితం పెళ్లి
మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని పాడ్ ప్రాంతంలో స్విప్నిల్ సావంత్ అలియాస్ సావంత్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. పాడ్ ప్రాంతంలోని ప్రముఖ ఆసుపత్రిలో సావంత్ మేల్ నర్స్ గా ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు చూపించిన ప్రియాంక క్షేత్రేని అలియాస్ ప్రియాంక అనే యవతిని ఐదు నెలల క్రితమే సావంత్ వివాహం చేసుకున్నాడు.

భార్యతో కళ్లు మూసుకుని కాపురం చేస్తున్నాడు
ఆసుపత్రి సమీపంలోనే భార్య ప్రియాంకతో సావంత్ అద్దె ఇంటిలో కాపురం ఉంటున్నాడు. ప్రింయాకను వివాహం చేసుకున్న తరువాత సాయంత్ ఆమెతో సావంత్ ఇష్టం లేకుండా కాపురం చేస్తున్నాడు. రాత్రి తన భార్య ప్రియాంక ఆత్మహత్యాయత్నం చేసిందని కుయ్యోమర్రో అంటూ సావంత్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

నా భార్య ఆత్మహత్య చేసుకుంది
ప్రియాంకను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయిందని చెప్పారు. తన భార్య ప్రియాంక ఆత్మహత్య చేసుకుందని సావంత్ బోరున విలపించాడు. తన భార్య ప్రియాంక అంత్యక్రియలు చెయ్యడానికి ఏర్పాట్లు చెయ్యాలని సావంత్ ఆమె కుటుంబ సభ్యులు, బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు.

విషం ఇంజక్షన్ ఇచ్చి భార్యను చంపేశాడు
ప్రియాంక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రియాంకకు ఆమె భర్త విషం ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది. ఇదే సందర్బంలో తన భర్త సావంత్ తనను ఎక్కువగా టార్చర్ పెడుతున్నాడని కొన్ని రోజుల క్రితం ప్రియాంక రాసిన లెటర్ పోలీసులకు చిక్కింది.

ఆసుపత్రిలో నర్సుతో భర్త రొమాన్స్
సావంత్ కు అతను ఉద్యోగం చేసే అసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న మహిళతో అక్రమ సంబంధం ఉందని వెలుగు చూసింది. విషం ఇంజక్షన్ ఇచ్చి భార్య ప్రియాంకను హత్య చేసి ఆసుపత్రిలో మరో నర్సుతో ఎంజాయ్ చెయ్యాలని అనుకున్న సావంత్ ను అరెస్టు చేశామని పాడ్ పోలీస్ స్టేషన్ అధికారి మీడియాకు చెప్పారు. వివాహం జరిగిన ఐదు నెలలకే సావంత్ అతని భార్య ప్రియాంకను హత్య చెయ్యడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications