కన్నడ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య, పిస్తోల్ ఖరీదు చేసింది ఎక్కడంటే ? మూడు సార్లు స్కెచ్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక సిట్ అధికారులు మారణాయుధాలు విక్రయించే డీలర్లను విచారణ చెయ్యడానికి రంగం సిద్దం చేశారు. గౌరీ లంకేష్ ను హత్య చేసిన నిందితులు ఉపయోగించిన పిస్తోల్ మారణాయుధాలు విక్రయించే డీలర్ల నుంచి కొనుగోలు చేశారని సిట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కన్నడ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య: రౌడీషీటర్ కుణిగల్ గిరి విచారణ, అనంతపురంలో !

రౌడీషీటర్ కుణిగల్ గిరి, అతని అనుచరులను విచారణ చేసిన సిట్ అధికారులు మారణాయుధాలు విక్రయించే డీలర్ల వివరాలు సేకరించారని, ఆకోణంలో వారిని విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారని శుక్రవారం వెలుగు చూసింది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే మారణాయుధాలు విక్రయించే డీలర్లను విచారణ చేస్తామని సిట్ అధికారులు అంటున్నారు.

With no leads in Gauri Lankesh murder case Karnataka cops look to arms dealers

ఎంఎం కులబర్గి, గౌరీ లంకేష్ హత్యకు ఒకే రకం పిస్తోల్ ఉపయోగించారని సిట్ అధికారుల విచారణలో వెలుగు చూసింది. గౌరీ లంకేష్ ను హత్య చేసింది స్థానికుడు కాదని సిట్ అధికారుల విచారణలో వెలుగు చూసింది. స్థానికుల సహాయం తీసుకున్న హంతకుడు గౌరీ లంకేష్ ను సెప్టెంబర్ 5వ తేదీ రాత్రి 6 గంటల సమయంలో హత్య చేశాడని సిట్ అధికారులు చెబుతున్నారు.

ఆదాయపన్ను శాఖ అధికారి కొడుకు కిడ్నాప్: రూ. లక్షలు డిమాండ్, కొత్త బుల్లెట్ లో షికారు !

మూడు సార్లు గౌరీ లంకేష్ ఇంటి దగ్గర మకాం వేసిన హంతకుడు చివరిసారిగా ఆమెను హత్య చేసి పారిపోయాడని సీసీ కెమెరాల పరిశీలనలో వెలుగు చూసిందని సిట్ అధికారులు అంటున్నారు. బెళగావి పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడ మారణాయుధాలు విక్రయించే డీలర్లను విచారణ చెయ్యడానికి సహకరించాలని సిట్ అధికారులు మనవి చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The police have started questioning an arms smuggler in connection with the Gauri Lankesh murder case. The police are checking for leads from the arms dealer to find out the trail behind the procurement of the pistol that was used in the murder.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి