వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జుకర్‌బర్గ్ కోరిక తీర్చని చైనా అధ్యక్షుడు జింపింగ్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌ కోరిన ఓ చిన్న కోరికను చైనా అధ్యక్షుడు జింపింగ్ సున్నితంగా తిరస్కరించారు. జుకర్ కోరింది చిన్న కోరికే అయినా.. అది చైనా అధ్యక్షుడికి తలకు మించిన బాధ్యతగా అన్పిందేమో.. అందుకే నో చెప్పారట.

ఈ విషయాన్ని షాంఘైయిస్ట్‌.కామ్‌ వెల్లడించింది. ఇటీవల ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ దంపతులు, చైనా అధ్యక్షుడు జింపింగ్‌ దంపతులు, అమెరికా అధ్యక్షుడు ఒబామా కుటుంబంతో వైట్‌‌హౌస్‌లో డిన్నర్‌కి హాజరైన విషయం తెలిసిందే.

Chinese President snubs Mark Zuckerberg’s unborn child

ఈ సందర్భంగా జింపింగ్‌తో జుకర్‌బర్గ్‌ మాండరిన్‌ భాషలో మాట్లాడారు. త్వరలో పుట్టబోయే తమ పాపాయికి ఓ మంచి చైనా పేరు పెట్టవలసిందిగా జుకర్‌బర్గ్‌ జింపింగ్‌ని కోరారు. తమ పాపాయికి చైనా పేరు పెట్టడాన్ని తాము గొప్ప గౌరవంగా భావిస్తామని ఆయన చెప్పారు.

అయితే పిల్లలకి పేరు పెట్టడమనేది చాలా పెద్ద బాధ్యతని, అది తన వల్ల కాదని జింపింగ్‌ సున్నితంగా తిరస్కరించారట. ఈ మేరకు చైనా మీడియాలో కథనాలు వచ్చాయి.

English summary
Chinese President Xi Jinping reportedly snubbed Facebook CEO Mark Zuckerberg's request to name the latter's unborn baby girl.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X