వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దైవాంశ సంభూతుడు.. మహిళలకు క్షమాపణ..! అతీతుడేమీ కాదని నిరూపించుకున్న దలైలామా..!

|
Google Oneindia TeluguNews

టిబెట్/హైదరాబాద్: దైవాంశ సంభూతుడు గా ముద్ర వేసుకున్న టిబెట్ గురువు దలైలామా సంయమనాన్ని కోల్పోయారు. ఎంతవారైనా మహిళల అంశంలో ఎప్పుడో ఏదో సందర్బంలో పట్టు కోల్పోతారనే ఉదంతానికి దలైలామా చేసిన వ్యాఖ్యలే ఉదాహరణ. ఇంద్రియాల మీద నియంత్రణ ఉన్న ఎంతటి వారినైనా స్త్రీ సమ్మోహన శక్తి ఆకర్శిస్తుందంటారు. అందుకు పురాణాల్లో కూడా ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. ఆథ్యాత్మిక గురువు దలైలామా ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై మహిళలకు క్షమాపణ చెప్పారు.

తన తర్వాత వచ్చే దలైలామా ఒక వేళ మహిళ అయితే.. ఆమె మరింత 'ఆకర్షణీయంగా' ఉండాలంటూ ఆయన ఇటీవల బీబీసీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన స్పందిస్తూ... తాను సరదాగా ఈ వ్యాఖ్యలు చేశాను తప్ప ఎవరినీ గాయపర్చే ఉద్దేశ్యం లేదన్నారు. 'ఇది ఆయన సొంత పునర్జన్మను గురించి అడిగిన ప్రశ్న. ఒకవేళ ఆయన స్త్రీగా జన్మిస్తే ఆమె మరింత ఆకర్షణీయంగా ఉండాలని ఆయన చెప్పారు. అంతే తప్ప ఆయనకు ఎవర్నీ బాధపెట్టే ఉద్దేశ్యం లేదన్నారు.

Dalai Lama Apologies to women..!

అయినప్పటికీ ప్రజల మనోభావాలు గాయపడేలా తాను మాట్లాడినందుకు ఆయన క్షమాపణలు చెప్పారు.' దలైలామా కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. మహిళలను ఓ వస్తువుగా చూపించడాన్ని తాను ఎప్పుడూ అంగీకరించలేదనీ.. మహిళలు, వారి హక్కుల కోసం ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచానని దలైలామా వివరించారు.

'లింగ సమానత్వంపై అంతర్జాతీయంగా వెల్లివిరుస్తున్న అవగాహన, మహిళల పట్ల పెరుగుతున్న గౌరవంపై ఆయన సంతోషంగా ఉన్నారు. ఆయన నాయకత్వం కింద ప్రవాసంలో ఉన్న టిబెట్ నన్స్‌కి కూడా గెషెమా-మా డిగ్రీలు ఇచ్చారు. అత్యున్నత స్థాయి స్కాలర్‌షిప్‌గా భావించే ఈ గౌరవం ఇంతకు ముందు పురుషులకు మాత్రమే ఉండేది.

English summary
Spiritual teacher Dalai Lama recently apologized to the women for his comments. In a recent interview with the BBC, he said that if the Dalai Lama is after him, she should be more attractive. He responded that these comments were controversial, he did not intend to make fun of anyone but himself.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X