షాకింగ్ తీర్పు: బాలుడ్ని కరిచిన కుక్కకు మరణ శిక్ష

Subscribe to Oneindia Telugu

ఇస్లామాబాద్: ఓ బాలుడ్ని కరచిన కుక్కకు మరణశిక్ష విధిస్తూ పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సు అసిస్టెంట్ కమిషనర్ రాజా సలీం సంచలన తీర్పునిచ్చారు. కుక్క కరవడం వల్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడని, అందుకే దోషి అయిన కుక్కకు మరణశిక్ష విధిస్తున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ సలీం స్పష్టం చేశారు.

అంతేగాక, బాలుడ్ని కరచిన కుక్క యజమాని ఎవరో గుర్తించి వారికి వ్యతిరేకంగా సివిల్ కోర్టులో కేసు పెట్టాలని అసిస్టెంట్ కమిషనర్.. అధికారులను ఆదేశించారు. కాగా, బాధిత బాలుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు తన కుక్కపై కేసు పెట్టి.. ఇప్పటికే వారంరోజుల పాటు జైలులో నిర్బంధించారని కుక్క యజమాని జమీల్ ఆవేదన వ్యక్తం చేవాడు.

Dog sentenced to death for biting child in Pakistan

జైలు శిక్ష విధించడమే కాకుండా తన పెంపుడు కుక్కను చంపాలని తీర్పు చెప్పడంపై జమీల్ అదనపు డిప్యూటీ కమిషనర్ కు అప్పీలు చేశారు. ఇప్పటికే తన కుక్కకు వారంరోజుల శిక్ష విధించినందున మళ్లీ మరణదండన విధించడం తగదని జమీల్ వేడుకుంటున్నాడు. తన పెంపుడు కుక్క కోసం తాను పై కోర్టులకెళ్లి న్యాయపోరాటం చేస్తానని జమీల్ తెలిపాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a peculiar punishment, a dog was on Tuesday sentenced to death in Pakistan’s Punjab province for biting a child. The dog, which bit a child, was sentenced to death by Assistant Commissioner Raja Saleem in Bhakkar’s Kalor vicinity in Punjab province, Geo TV reported.
Please Wait while comments are loading...