యూట్యూబ్‌కు పోటీ వచ్చేసింది! రంగంలోకి ఫేస్‌బుక్‌ ‘వాచ్’

Posted By:
Subscribe to Oneindia Telugu

శాన్‌ఫ్రాన్సిస్కో : వీడియోల వీక్షణకు, షేరింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన యూట్యూబ్‌ కు తాజాగా గట్టి పోటీ ఎదురైంది. యూట్యూబ్‌కు పోటీగా ఫేస్‌బుక్‌ సరికొత్తగా రీడిజైన్‌ చేసిన వీడియో ట్యాబ్‌ 'వాచ్‌' ను రంగంలోకి దింపింది.

తమ వీడియో ఆఫర్స్‌ను మరింత విస్తరిస్తూ టెలివిజన్‌ మార్కెట్‌లో గట్టిపోటీని ఇవ్వడానికి ఫేస్‌బుక్‌ దీన్ని లాంచ్‌ చేసింది. ప్రొఫెషనల్‌ ఉమెన్స్‌ బాస్కెట్‌బాల్‌ నుంచి సఫారీ షోల వరకు అన్ని రకాల వీడియో ప్రొగ్రామ్‌లను ఇది ఆఫర్‌ చేయనుంది.

 Facebook Takes on YouTube With 'Watch' Video Tab

రీడిజైన్ చేసిన 'వాచ్‌' ను ప్రస్తుతం అమెరికాలోని ఫేస్‌బుక్‌ మొబైల్‌ యాప్‌, వెబ్‌సైట్‌, టెలివిజన్‌ యాప్ లు వినియోగిస్తున్న పరిమిత గ్రూపు సభ్యులకు మాత్రమే అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఫేస్‌బుక్‌ తెలిపింది.

గతేడాదే ఈ వీడియో ట్యాబ్‌ను ఫేస్‌బుక్‌ లాంచ్‌ చేసింది. మే నెలలోనే ఫేస్‌బుక్‌ మిలీనియల్‌ ఫోకస్డ్‌ న్యూస్‌, ఎంటర్‌టైన్మెంట్‌ క్రియేటర్స్‌ వోక్స్‌ మీడియా, బజ్‌ఫీడ్‌, ఏటీటీఎన్‌, గ్రూప్‌ నైన్‌ మీడియా, ఇతర వాటితో ఒప్పందాలు చేసుకుంది.

స్క్రిప్ట్‌, స్క్రిప్ట్‌లేని షోలను ప్రొడ్యూస్‌ చేయడానికి ఈ ఒప్పందం కుదుర్చుకుంది. న్యూస్‌ ఫీడ్‌లో ప్రజలు ఎక్కువగా వీడియోలను చూసేందుకు ఇష్టపడతారని తాము తెలుసుకున్నట్టు ఫేస్‌బుక్‌ ప్రొడక్ట్‌ డైరెక్టరర్‌ డానియల్‌ డాంకర్‌ చెప్పారు.

యూజర్లు వీడియో ఎపిసోడ్స్‌ను చూస్తున్నప్పుడు చాట్‌ చేసుకోవడానికి, ఇతరులతో కనెక్ట్‌ కావడానికి ఈ వాచ్‌ వీడియో ట్యాబ్ సహకరిస్తుందని ఫేస్‌బుక్‌ సీఈవో, వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ తెలిపారు. కమ్యూనిటీని అభిృద్ది చేసుకోవడానికి అదే షోలను ఇష్టపడుతున్న వారు గ్రూప్‌లను కూడా ఏర్పరచుకోవచ్చని పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In an apparent bid to take on Google-owned YouTube, Facebook has rolled out 'Watch' - a redesigned video platform for creators and publishers. The social media giant last year launched 'Video' tab in the US which offered a predictable place to find videos on Facebook. "Now we want to make it even easier to catch up with shows you love. We're introducing 'Watch', a new platform for shows on Facebook. 'Watch' will be available on mobile, on desktop and laptop and in our TV apps," Daniel Danker, Director of Product at Facebook wrote in a blog post on Wednesday.
Please Wait while comments are loading...