H1B: హెచ్1బీ వీసాలపై ట్రంప్ కీలక నిర్ణయం..! లాటరీ అవుట్- అవే కీలకం ?
అమెరికా కంపెనీలు విదేశీ నిపుణుల్ని నియమించుకునేందుకు వీలుగా అక్కడి ప్రభుత్వం విదేశీయులకు ఇస్తున్న హెచ్1బీ వీసాల జారీ విధానంలో మరో పెనుమార్పు. ఇప్పటివరకూ కంప్యూటర్ ఆధారిత లాటరీ విధానంలో వీసాలు జారీ చేస్తుండగా.. ఇప్పుడు మరో కొత్త విధానం అమల్లోకి రాబోతోంది. ఇప్పటికే హెచ్1బీ వీసా ఇంటర్వ్యూల్ని నిలిపేయడం ద్వారా కొత్త విధానం అమలుకు ప్రయత్నిస్తున్న ట్రంప్ సర్కార్.. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
హెచ్1బీ వీసాల జారీ విధానంలో సమగ్ర మార్పులు చేస్తున్న ట్రంప్ సర్కార్ తాజాగా పలు కీలక ప్రతిపాదనలు చేసింది. వీటిని అమెరికా హోంశాఖ పంపిన ప్రతిపాదనలపై తుది సమీక్ష జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న లాటరీ ఆధారిత వీసాల జారీ విధానానికి చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని స్ధానంలో వేతనాల ఆధారంగా హెచ్1బీ వీసాల జారీ విధానం అమలు చేయాలని నిర్ణయించబోతున్నారు.

ఇమ్మిగ్రేషన్ సంస్థ ఫ్రాగోమెన్ నివేదిక ప్రకారం ఆఫీస్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ బడ్జెట్ సమీక్షిస్తోంది. ఇందులో నిపుణులైన కార్మికుల్ని మాత్రమే దేశంలోకి అనుమతించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు సమీక్ష జరుపుతున్నారు. దీని ప్రకారం ఇకపై కంప్యూటర్ ఆధారిత వీసాల జారీ విధానం స్ధానంలో వెయిటెడ్ సెలక్షన్ సిస్టమ్ అమలు కానుంది. ఈ విధానంలో ఉద్యోగుల వేతన స్థాయి ఆధారంగా వీసాల దరఖాస్తుల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. ఈ లెక్కన ఎక్కువ వేతనాలు ఉన్న నిపుణులైన ఉద్యోగులకు ముందుగా హెచ్1బీ వీసాలు లభిస్తాయి. మిగిలిన వారికి ప్రాధాన్యత క్రమంలో ఆ తర్వాత జారీ చేస్తారు.

అమెరికా కంపెనీలు కేవలం విదేశీ నిపుణుల్ని మాత్రమే ఉద్యోగాల్లో నియమించుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు ఇలా అధిక వేతనాలకు హెచ్1బీ వీసాల జారీలో ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా కంపెనీలపై హెచ్1బీ కొత్త వీసాల జారీ కి ఏడాదికి లక్ష డాలర్ల ఫీజు వసూలు చేయాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇంకా కంపెనీలు ఈ నిబంధనను సైతం లెక్కచేయకుండా తమ రిక్రూట్ మెంట్లు కొనసాగిస్తున్నాయి. దీంతో ట్రంప్ ఇప్పుడు వేతనాల ఆధారంగా మాత్రమే హెచ్1బీ వీసాల జారీకి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
-
ఇరాన్ తో యుద్దం వేళ ట్రంప్‌కు చుక్కలు చూపిస్తున్న అమెరికా ప్రజలు- ఉక్కిరి బిక్కిరి..!! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ!












Click it and Unblock the Notifications