కూలుతున్న అమెరికా విమానాలు-కువైట్ ప్రకటన-దాడులతో సౌదీ ఆరామ్కో మూత..!
ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) ప్రారంభించిన యుద్దం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ సహా పలువురు కీలక నేతలు చనిపోవడంతో ఆ దేశం ప్రతీకారంతో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలపై దాడులకు దిగుతోంది. ఇందులో అమెరికా బేస్ లతో పాటు గల్ఫ్ దేశాల ఆస్తులూ ఉంటున్నాయి. దీంతో ఆయా దేశాల్లో నష్టం అంతకంతకూ పెరుగుతోంది.
కువైట్ (Kuwait)లో ఇవాళ అనేక అమెరికా యుద్ధ విమానాలు కూలిపోయాయని, పైలట్‌లందరూ సురక్షితంగా బయటపడ్డారని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రమాదాలకు గల కారణాలను మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు. కానీ ఆ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తున్న సమయంలో ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పైలట్లను చెకప్‌ల కోసం ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా మాత్రం దీనిపై స్పందించలేదు.

US warplane crash over Kuwait ,,,, pic.twitter.com/Ghv5I9d2KS
— Nagi N. Najjar (@NagiNajjar) March 2, 2026
మరోవైపు ఇరాన్ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న సౌదీ అరేబియా (saudi arabia)ప్రభుత్వ చమురు దిగ్గజం ఆరామ్‌కో (Aramco)ఇవాళ తన రాస్ తనూరా శుద్ధి కర్మాగారాన్ని మూసేసింది. గల్ఫ్ తీరంలోని ప్రభుత్వ రాస్ తనూరా కాంప్లెక్స్ రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల సామర్థ్యం కలిగిన మధ్యప్రాచ్యంలోని అతిపెద్ద శుద్ధి కర్మాగారాలలో ఒకటి. సౌదీ ముడి చమురుకు కీలకమైన ఎగుమతి టెర్మినల్‌గా పనిచేస్తుంది. ముందు జాగ్రత్త చర్యగా దీనిని మూసివేసినట్లు, పరిస్థితి అదుపులో ఉందని ప్రభుత్వం తెలిపింది. అటు ఇరాన్ దాడుల కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్‌లలో ప్రధాన షిప్పింగ్ హబ్‌లు స్తంభించిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ దాదాపు 10 శాతం పెరిగింది. దీంతో అంతర్జాతీయంగా చమురు మంటలు తప్పేలా లేవు.

-
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
హార్ముజ్ లో జాంబీ షిప్ ? ఐదేళ్ల క్రితం మాయమై.. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష్యం..! -
ఇరాన్ కు జి7 దేశాల తీవ్ర హెచ్చరిక! -
షాకింగ్ వీడియో: అమెరికా F-15 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్ -
Iran: ట్రంప్ అల్టిమేటం వేళ హార్ముజ్ పై ఇరాన్ కీలక నిర్ణయం-ఆ కండిషన్ తో ..! -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
1970ల నాటి చీకటి రోజులు మళ్లీ: సంచలన హెచ్చరిక! -
ఇరాన్ వార్ పై ప్రధాని సమీక్ష-చమురు, గ్యాస్, ఎరువులపై కీలక నిర్ణయాలు ?












Click it and Unblock the Notifications