ఇజ్రాయెల్ కెమికల్ ఫ్యాక్టరీలపై ఇరాన్ క్షిపణుల వర్షం.. లీకైన విష వాయువు..!!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెల రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఇజ్రాయెల్ లోని కెమికల్ ఫ్యాక్టరీలపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. దక్షిణ ఇజ్రాయెల్ లోని రమత్ హోవావ్ ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్న రసాయన ఫ్యాక్టరీపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడి కారణంగా ఆ ప్రాంతంలో భారీగా కెమికల్స్ లీక్ అయ్యే ప్రమాదం ఉన్నట్లు ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక ఇరాన్ జరిపిన దాడి తర్వాత బీర్షేబాలో పడిన శిథిలాల వల్ల నలుగురికి స్వల్ప గాయాలైనట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇజ్రాయెల్ అత్యవసర సేవల సంస్థ మాగెన్ డేవిడ్ అడోమ్ ప్రకారం.. ఈ ఘటన కారణంగా గాయపడిన మరో 9 మంది చికిత్స పొందుతున్నారు. ఈ దాడి దక్షిణ ఇజ్రాయెల్‌లోని రసాయన కర్మాగారంపై జరిగిన నేపథ్యంలో.. ఇది ప్రమాదకర రసాయనాల లీకేజీకి దారి తీయవచ్చనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో అధికారులు సమీప నివాసితులకు పలు కీలక సూచనలు చేస్తున్నారు. ఫ్యాక్టరీ సమీపంలోని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు.
రసాయన ఫ్యాక్టరీలపై దాడుల నేపథ్యంలో విషపూరిత వాయువులు రిలీజ్ అయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ రసాయనాల వల్ల పర్యావరణానికి అలాగే ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. ఈ దాడుల అనంతరం బీర్షెబాతో పాటు సమీప ప్రాంతాల్లోని ప్రజలు.. ఇళ్లలోనే ఉండాలని.. కిటికీలు, తలుపులు మూసి వేయాలని సూచనలు చేశారు అధికారులు. అలాగే ఎయిర్ కండీషనర్లను కూడా ఆపివేయాలని సూచనలు చేశారు.

మరోవైపు ఇరాన్ చేపట్టిన దాడుల్లో సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లో ఉన్న అమెరికాకు చెందిన ఈ3 విమానం ధ్వంసమైంది. ఈ విమానం విలువ దాదాపు 500 మిలియన్ డాలర్లు అని స్పష్టం అవుతోంది. కాగా ఈ దాడిలో 15 మంది అమెరికా సైనికులకు తీవ్రగాయాలు కాగా.. వీరిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
-
అమెరికా సైన్యం షార్క్‌లకు ఆహారమే: ఇరాన్ భీకర హెచ్చరిక.. -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విభేదాలు? వాన్స్-నెతన్యాహు సంచలన కాల్ లీక్..! -
ట్రంప్ ఫోన్లు ఎత్తని ఇరాన్ ? ముందుకెళ్లని చర్చలకు 3 కారణాలు..! -
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
భారత్‌కు ఇరాన్ బంపరాఫర్!.. ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
Lockdown: లాక్ డౌన్ ఎక్కడంటే ?- పార్లమెంట్ లో తేల్చేసిన ఆర్థికమంత్రి..! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!











Click it and Unblock the Notifications