వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారు, ప్రిజ్, టీవీ కొనకండి, అమెజాన్ ఫౌండర్ సూచన, క్రిస్మస్ వేళ కీ సజెషన్

|
Google Oneindia TeluguNews

క్రిస్మస్ పండగ రాబోతుంది. ఏడాదికి ఒక పెద్ద ఫెస్టివల్ అయినందున.. క్రిస్టియన్స్ షాపింగ్ మాములుగా ఉండదు. ఇక అమెరికా లాంటి దేశాల్లో అయితే చెప్పలేం. అయితే ఆర్థిక మాంద్యం వల్ల షాపింగ్ ఎక్కువగా చేయొద్దని నిపుణులు చెబితే ఫరవాలేదు.. కానీ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సూచించారు. ఇదీ ప్రాధాన్యం సంతరించుకుంది.

జెఫ్ బెజోస్ అమెజాన్ వ్యవస్థాపకుడే కాదు ప్రపంచ కుబేరుడు కూడా. అతను తనకు బిజినెస్ జరిగితే పోలా అనుకోలేదు. అందరికీ గురించి మరీ చెప్పారు. క్రిస్మస్ సీజన్ లో డబ్బు ఖర్చు చేయకుండా దాచుకోవాలని అమెరికన్లకు సూచించారు. అందుకు కారణం ఆర్థిక వ్యవస్థ పరిస్థితి క్షీణించడమేనని వివరించారు. ఈ సమయంలో కార్లు, పెద్ద టీవీలు, ఫ్రిజ్ కొనుగోలు చేయవద్దని పేర్కొన్నారు. అందుకు ప్రత్యేక కారణం కూడా ఉంది.

Jeff Bezos

భారీగా కొనుగోలు చేయాలనుకుంటే ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని బెజోస్ సూచించారు. చిన్న వ్యాపారులు కొత్త పెట్టుబడుల జోలికి వెళ్లకుండా ఉండాలని కోరారు. తమ డబ్బును జాగ్రత్త చేసుకోవాలని మరీ మరీ నొక్కి వక్కానించారు. ఒకవేళ రిస్క్ తీసుకుని కొనుగోలు చేస్తే, ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సుతిమెత్తగా హెచ్చరించారు.

ఆర్థిక వ్యవస్థ ఇప్పటికిప్పుడు అయితే ఫర్లేదు. కరోనా తర్వాత దెబ్బతిని ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కానీ బెజోస్ సూచనలను తేలికగా తీసుకునే అవకాశం ఉండదు. ఆయన డిప్‌గా ఆలోచించే సూచన చేసి ఉంటారు. సో అమెరికన్లే కాదు.. అందరూ దానిని పాటిస్తే మంచిదే. లేదంటే ఈఎంఐ కూడా కట్టుకోలేక ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు.

English summary
Amazon founder and billionaire Jeff Bezos recently warned consumers and businesses that they should consider postponing large purchases during the holiday season due to Predict an economic recession.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X