నర్సింగ్ హోంలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి, పలువురు పరిస్థితి విషమం!
Fire Accident: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బ్రిస్టల్ టౌన్‌షిప్‌లోని సిల్వర్ లేక్ నర్సింహ్ హోంలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే.. భవనంలోని ఓ భాగం కుప్పకూలిపోవడమే కాకుండా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు
ఈ భీకర పేలుడులో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఇద్దరు నర్సింగ్ హోమ్‌లో నివసిస్తున్న వృద్ధులు కాగా.. మరొకరు అక్కడే పనిచేస్తున్న సిబ్బంది అని అధికారులు ధ్రువీకరించారు. పేలుడు ధాటికి 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

గ్యాస్ లీకేజీయే కారణమా?
ప్రమాదం జరిగిన సమయంలో నర్సింగ్ హోంలో దాదాపు 158 మంది వృద్ధులు ఉన్నారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో భవనం లోపల గ్యాస్ వాసన దట్టంగా వ్యాపించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. గ్యాస్ వాసన వస్తున్నప్పటికీ.. ప్రాణాలకు తెగించి లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రాథమిక విచారణ ప్రకారం.. గ్యాస్ లీక్ కావడం వల్లే ఈ భారీ పేలుడు సంభవించిందని అధికారులు అనుమానిస్తున్నారు. పెన్సిల్వేనియా పబ్లిక్ యుటిలిటీ కమిషన్ ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది.
సహాయక చర్యలు
ప్రమాదం తర్వాత నర్సింగ్ హోమ్ పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించారు. ఆస్పత్రి భవనం ఒక భాగం పూర్తిగా ధ్వంసం కావడంతో అధికారులు దానిని అత్యంత విధ్వంసకర ప్రమాదంగా అభివర్ణించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి వందలాది మంది వృద్ధులను రక్షించగలిగారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications