వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు అంగారకుడిపై ఎగరనున్న తొలి హెలికాఫ్టర్‌ - చరిత్ర సృష్టించనున్న నాసా

|
Google Oneindia TeluguNews

ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లో మరో కీలక అడుగుకు సర్వం సిద్దమైంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ నాసా తొలిసారిగా ప్రయోగిస్తున్న హెలికాఫ్టర్‌ ఇన్‌జెన్యుటీ ఇవాళ అంగారకుడిపై ఎగరబోతోంది. నాసా అక్కడికి పంపిన హెలికాఫ్టర్‌ ఇప్పటికే ఎగరాల్సి ఉన్నా సాంకేతిక సమస్యలతో ఆలస్యమైంది. ఇవాళ అంగారకుడిపై హెలికాఫ్టర్ ఎగిరితే భూమి తర్వాత మరో గ్రహంపై ప్రయోగించిన తొలి శక్తివంతమైన, నియంత్రిత హెలికాఫ్టర్‌ ఇదే కాబోతోంది. ఆ క్షణాల కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు ఎదురుచూస్తున్నారు.

Recommended Video

#MarsHelicopter గ్రహాంతరంపై ఎగిరిన మొట్టమొదటి మానవతయారీ హెలికాప్టర్
చారిత్రక నాసా హెలికాఫ్టర్‌ ప్రయోగం

చారిత్రక నాసా హెలికాఫ్టర్‌ ప్రయోగం

భూమి మీద లక్షల హెలికాఫ్టర్టు నిత్యం ప్రయాణాలు సాగిస్తూనే ఉంటాయి. కానీ భూమి తర్వాత మరో గ్రహంపై హెలికాఫ్టర్‌ ఎగిరితే ఎలా ఉంటుందన్న అంశం ఊహకు కూడా అందదు. ఎందుకంటే ఇప్పటివరకూ ఎప్పుడూ మరో గ్రహంపై హెలికాఫ్టర్‌ ప్రయోగాలు జరగలేదు. కానీ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ నాసా తొలిసారిగా అంగారకుడిపై ఇలా ఓ హెలికాఫ్టర్‌ ఎగరేయబోతోంది. ఇప్పటికే నాసా రోవర్ ద్వారా అంగారకుడిపైకి పంపిన హెలికాఫ్టర్‌ ఎగరాల్సి ఉన్నా.. వాతావరణ పరిస్ధితులు, ఇతర సాంకేతిక సమస్యలతో ఆలస్యమైంది. దీంతో ఇవాళ హెలికాఫ్టర్ ఎగరేసేందుకు నాసా సిద్ధమవుతోంది.

భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ప్రయోగం

భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత ఈ హెలికాఫ్టర్‌ ఎగరబోతోంది. అమెరికా అంతరిక్ష సంస్ధ నాసా భూమిపై నుంచి ఈ హెలికాఫ్టర్‌ను నియంత్రించబోతోంది. హెలికాఫ్టర్‌ ఎగిరిన రెండు, మూడు గంటల తర్వాత నుంచి నాసా ఈ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేయబోతోంది. ఎందుకంటే హెలికాఫ్టర్‌ ఎగరగానే ఆ దృశ్యాలు వెంటనే నాసాకు చేరవు. ఓసారి నాసాకు హెలికాఫ్టర్‌ దృశ్యాలు నాసాకు చేరడం ప్రారంభమైన తర్వాత నాసా ప్రపంచానికి చూపబోతోంది. ఈ అరుదైన దృశ్యాలను వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు.

తొలిసారి మరో గ్రహంపై హెలికాఫ్టర్‌ ప్రయోగం

ప్రపంచంలో భూమిపై ఇప్పటివరకూ హెలికాఫ్టర్లు, విమానాలు ఎగురుతున్నా.. మరే ఇతర గ్రహంపైనా ఇలాంటి ప్రయోగాలు జరగడం లేదు. ఇందుకు కారణం అక్కడి వాతావరణ పరిస్దితులపై అవగాహన లేకపోవడమే. ఓసారి ఇతర గ్రహాలపై వాతావరణ పరిస్దితులు హెలికాఫ్టర్లు, విమానాలు ఎగిరేందుకు అనుకూలంగా ఉన్నాయని తేలిపోతే.. ఆ తర్వాత నుంచి హెలికాఫ్టర్లలో ఆయా గ్రహాల్లో విహరించేందుకు వీలు కలుగుతుంది. దీంతో నాసా ఇవాళ ప్రయోగిస్తున్న హెలికాఫ్టర్లు భవిష్యత్ ప్రయోగాలకు మార్గదర్శి కాబోతోంది.

English summary
NASA is hoping to make history early on Monday when the Ingenuity Mars Helicopter attempts the first powered, controlled flight on another planet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X