వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవాజ్ షరీఫ్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

|
Google Oneindia TeluguNews

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి ఆసుపత్రి పాలు అయ్యాడు. శనివారం మధ్యహ్నం ఆయనకు గుండెపోటు రావడంతో లాహోర్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా జైల్లో ఉన్న నవాజ్‌షరీఫ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఇటివలే ఆయన పెరోల్ మీద బయటకు వచ్చాడు.

గత కొద్దిరోజులుగా పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న మాజీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. గత వారం రోజుల క్రితమే ఆనారోగ్యంతో ఆయన ఆసుపత్రి పాలయ్యాడు. ప్లెట్‌లెట్ తగ్గడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. దీంతో నేడు మరోసారి ఆయన మొదటిసారి హర్ట్ ఎటాక్ ఎదురైంది. హుటాహుటిన లాహోర్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు స్థానిక మీడీయా తెలిపింది.

Nawaz Sharif has suffered a heart attack

అయితే నవాజ్ షరీఫ్ జైల్లో మగ్గుతున్న నేపథ్యంలోనే ఆయనకు ఆరోగ్యం క్షీణించడంతో ప్రభుత్వం పెరోల్ మీద విడుదల చేసింది. దీంతో తిరిగి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తాడనే వార్తలు కూడ వెలువడ్డాయి. కాని ఆయన ఆరోగ్యం సహకరించక పోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మరోవైపు పనామా పేపర్స్‌ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని అరెస్టైన నవాజ్‌ షరీఫ్‌‌కు శుక్రవారమే అనారోగ్యం క్షీణించడం కారణంగా మెడికల్ గ్రౌండ్‌లో నవాజ్‌ షరీఫ్‌కు లాహోర్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న విషయం తెలుసుకున్న పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నవాజ్‌ షరీఫ్‌కు అత్యుత్తమ చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.

English summary
Former Pakistan Prime Minister Nawaz Sharif has suffered a heart attack at Services Hospital in Lahore, reported Pakistani media on Saturday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X