సంచలనం: అమెరికా నిఘాలో ఉ.కొరియా అణ్వాయుధాలపై షాకింగ్ నిజాలు!

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: క్షిపణి ప్రయోగాలతో ప్రపంచ శాంతికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్న ఉత్తరకొరియా తీరు నానాటికి వినాశనం దిశగానే సాగుతోంది. ప్రపంచ దేశాల అభిప్రాయాలు, హెచ్చరికలతో సంబంధం లేకుండా మరిన్ని అణ్వయుధాలను, అణు బాంబులను రూపొందించుకుంటూనే ఉంది.

అగ్రరాజ్యం అమెరికాకు సైతం ఉత్తరకొరియా తీరు కొరకరాని కొయ్యగా తయారవతుండటంతో.. ఆ దేశాన్ని నిలువరించడం ప్రశ్నార్థకంగానే మారిపోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉత్తరకొరియా అణ్వాయుధ నిల్వలపై అమెరికా ఫోకస్ పెట్టగా.. పలు సంచలన విషయాలు వెలుగుచూశాయి.

ఉత్తరకొరియాతో గండమే?: ముక్కలు చేస్తామని హెచ్చరిక.. పుతిన్ ఇలా!

North Korea's nuclear weapons advancements

ఉత్తరకొరియా వద్ద ఇప్పటికే 20అణుబాంబులు ఉన్నాయని, ఇకపై నెలకొక అణుబాంబు చొప్పున తయారుచేసి ప్రపంచ వినాశనానికి తెరదీయనుందని అమెరికా నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఉత్తరకొరియా అణ్వాయుధాలపై సాటిలైట్ నిఘాతో అమెరికా కొన్ని ఛాయచిత్రాలను సంపాదించింది. ఈ ఫోటోల్లో ఉత్తరకొరియా వద్ద భారీ మోతాదులో ప్లూటోనియం, ఇతరత్రా అణ్వస్త్ర సామాగ్రి నిల్వ ఉన్నట్లు తేలింది.

దీన్నిబట్టి ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్.. మరిన్ని క్షిపణి ప్రయోగాలకు సిద్దపడుతున్నట్లుగా అర్థమవుతోందని అమెరికా అభిప్రాయపడుతోంది. రేడియో కెమికల్ లేబరోటరీలో మరో రెండు ప్రయోగాలకు సరిపోయే అణు పదార్థాలు ఉత్తరకొరియా వద్ద ఉన్నట్లు అమెరికా గుర్తించింది.

Indian-American jailed for 6 yrs in healthcare fraud

ఇటీవల అమెరికా స్వాతంత్ర్య దినోత్సవమైన జులై 4న కూడా ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం చేపట్టిన సంగతి తెలిసిందే. తద్వారా అమెరికాతో కయ్యానికి కాలు దువ్వుతున్నట్లు పరోక్షంగా సంకేతాలు పంపించింది. దీంతో ఆ దేశాన్ని నిలువరించాలంటే రష్యా, చైనాల సహకారం తీసుకోవాలని అమెరికా భావిస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After North Korea's first test-firing of an intercontinental ballistic missile last week, the country's leader, Kim Jong Un, has moved one step closer to perfecting a nuclear missile capable of reaching the United States, a weapons program launched by his grandfather and nurtured by his father.
Please Wait while comments are loading...