వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంటిలేటర్‌పై సల్మాన్ రష్డీ.. ఓ కన్ను కోల్పోయే అవకాశం..?

|
Google Oneindia TeluguNews

సల్మాన్ రష్దీపై న్యూయార్క్‌లో దాడి జరిగిన సంగతి తెలిసిందే. సాహితీ సదస్సుకు హాజరైన ఆయనపై ఆగంతుకుడు కత్తితో అటాక్ చేశాడు. 15 కత్తిపోట్లతో దాడి చేయడంతో రష్దీ వేదికపై కుప్పకూలిపోయాడు. మెడ, ఉదర భాగంలో తీవ్రగాయాలు అయ్యాయి. హెలికాప్టర్‌లో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సల్మాన్ రష్దీ వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఓ కన్ను కోల్పోయే ముప్పు ఏర్పడిందని రష్దీ ప్రతినిధి ఆండ్రూ వైలీ వెల్లడించారు.

 Salman Rushdie on life support

కత్తిపోటు వల్ల కాలేయం కూడా దెబ్బతిందని తెలిపారు. మోచేతి వద్ద నరాలు ఛిద్రం అయ్యాయని వైలీ వివరించారు. రష్దీ మాట్లాడలేకపోతున్నారని తెలిపారు. రష్దీపై దాడికి పాల్పడిన వ్యక్తిని హాదీ మతార్‌గా గుర్తించారు. అతడు ఇరాన్ అనుకూల భావాలు ఉన్న వ్యక్తిగా భావిస్తున్నారు. సల్మాన్ రష్దీ భారత సంతతి రచయిత. ఆయన రచించిన ద శాటానిక్ వర్సెస్ నవల ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ ఛాందస వాదుల ఆగ్రహానికి గురైంది. రష్దీని చంపేయాలని అప్పట్లో ఇరాన్ మహానేత ఆయతొల్లా ఖొమేనీ ఫత్వా కూడా జారీ చేశారు.

Recommended Video

Apple ని దివాలా నుంచి కాపాడిన Microsoft... ఎప్పుడు? ఎలా? *Trending | Telugu OneIndia

రష్దీ భారతీయ అమెరికన్ మోడల్ పద్మాలక్ష్మిని నాలుగో వివాహం చేసుకున్నారు. ఆయనకు అంతకుముందే మూడు వివాహాలు జరిగాయి. పద్మాలక్ష్మితో రష్దీ వివాహం 2004లో జరగ్గా, మూడేళ్లకే విడిపోయారు. సభా వేదికపై సరయిన భద్రతా చర్యలు తీసుకున్నారట. ఆ మేరకు చౌతానా ఇనిస్టిట్యూట్ తెలిపింది. మెటల్ డిటెక్టర్స్ ఏర్పాటు చేయలేదని ఆరోపణలు వచ్చాయి.

English summary
Author Salman Rushdie has been put on a ventilator, according to his book agent Andrew Wylie.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X