viral video:వావ్.. మేఘాలను తాకిన అలలు, అద్భుతంగా వీడియో.. మరీ నిజమేనా..?
దూరపు కొండలు నునుపు అంటారు. అంతేకాదు దూరం నుంచి చూస్తే సముద్రం చివర, ఆకాశాన్ని తాకినట్టు అనిపిస్తోంది. కానీ అదీ నిజం కాదు. అలాగే అలలు కూడా ఉవ్వెత్తున ఎగసిపడతాయి. అవీ ఎంత ఎత్తుకు లేచిన.. నింగిని మాత్రం తాకవు. ఇదీ ముమ్మాటికీ నిజం. ఇందులో సందేహానికి తావులేదు. కానీ ఓ వీడియో మాత్రం అలలు మేఘాన్ని తాకినట్టు కనిపించింది. దానిని చూస్తే.. కళ్లు తడుముకొని మరీ చూస్తాం. ఆ వీడియోను మీరు కూడా చూడండి.
40 సెకన్ల నిడివి గల వీడియో చూపరులను కట్టి పడేస్తోంది. నిజంగా తాకాయా అనే సందేహాం కలుగుతుంది. అలలు మేఘాలను తాకి.. తిరిగి కిందకి వచ్చినట్టు కనిపిస్తోంది. కానీ అదీ నిజం కాదు.. ఈ వీడియో కూడా పాతదే.. కానీ ఇప్పుడు వైరల్ అవుతుంది. ట్విట్టర్‌లో ఒకరు షేర్ చేశారు. ఇంకేముంది ట్రోల్ అవుతుంది. ఇప్పటికే 7.50 లక్షల వ్యూస్ వచ్చాయి. వీడియో నిజమే కానీ.. మేఘాలు మాత్రం కాదట.

ఆ వీడియోలో సముద్రపు ఏరోసోల్ సృష్టించారు. మేఘాలను సృష్టించారని అమెరికాకు చెందిన నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ తెలిపింది. సముద్రంలో బబుల్స్ ఆకారంలో పునర్ సృష్టి చేశారు. దాని వల్ల అలా కనిపిస్తోందని వివరించారు. కానీ నిజంగా మాత్రం మేఘాన్ని అలలు తాకినట్టే కనిపిస్తోంది. శాస్త్రవేత్తలు ఏం జరిగిందో తెలియజేయడంతో తత్వం బోధపడింది.
వాస్తవానికి ఆ వీడియో కూడా చాలా చక్కగా ఉంది. అలలు పైకి లేచి.. మళ్లీ కిందకు పడిపోతు అందంగా కనిపించాయి. దాని పైన నల్ల రంగులో ఉండటంతో.. ఆకాశాన్ని తాకిందనే అంతా అనుకున్నారు. కానీ దానికి గల కారణాలను వివరించడంతో అయ్యో ఇలా జరిగిందా అని రిలాక్స్ అయ్యారు. కానీ క్రియేషన్ మాత్రం నిజంగానే అదిరిపోయింది.












Click it and Unblock the Notifications