రష్యాకు దెబ్బే..? ఖేర్సన్ నుంచి బలగాల విత్ డ్రా, ఇంకా ఉన్నాయంటోన్న ఉక్రెయిన్
ఉక్రెయిన్ నుంచి రష్యా దళాలు క్రమంగా వెళుతున్నాయి. అయితే ఉక్రెయిన్ సేనలు కూడా దాడులకు పాల్పడటంతో.. రష్యా కూడా దిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఖేర్సన్ సమీపంలో ఉక్రెయిన్ దాడి చేసింది. దీంతో డిప్నొర్ నదీ పశ్చిమ తీరం నుంచి దళాలను విత్ డ్రా చేసుకుంటున్నామని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తెలిపారు. దీనిపై ఉక్రెయిన్ స్పందించింది.
ఇప్పటికీ కొన్ని రష్యా దళాలు ఖేర్సన్‌లో ఉన్నాయని ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు మైఖైలో పోడోల్యాక్ రాయిటర్ వార్తాసంస్థతో మాట్లాడుతూ తెలిపారు. ఉక్రెయిన్ దాడి నేపథ్యంలో పరిస్థితి మళ్లీ చేయి దాటే అవకాశం ఉంది. యుద్దం సంభవించే ఛాన్స్ ఉండటంతో.. రష్యా కూడా వెనక్కి తీసుకున్నామే అని చెప్పింది.

ఖేర్సన్‌లో ఉక్రెయిన్ జెండా ఎగరవేసే వరకు రష్యా తమ దళాల ఉపసంహరణ గురించి మాట్లాడటంలో అర్థం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సీనియర్ సలహాదారు మెఖైల్ పోడోల్యాక్ మీడియాకు తెలిపారు. ఖేర్సన్‌ను రష్యా ఫిబ్రవరిలో ఆక్రమించుకుంది. దీనిని ప్రత్యేక సైనిక చర్యగా రష్యా అప్పుడే ప్రకటన చేసింది. అయితే ఇప్పుడు విడిచి వెళ్లడం అగ్రదేశానికి ఎదురుదెబ్బే అవుతుంది.
ఇకపై ఖేర్సన్ నుంచి యుద్దం యొక్క సామాగ్రి సరఫరా చేయడం కుదరదని రష్యా జనరల్ సెర్గీ సురోవికిన్ తెలిపారు. నదీ తూర్పున రక్షణ రేఖ చేపట్టాలని తమ దళాలకు స్పష్టంచేశానని వివరించారు. ప్రభుత్వ ప్రతిపాదనలతో ఏకీభవిస్తున్నానని తెలిపారు. నదీ మార్గం మీదుగా దళాలను బదిలీ చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications