వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ,బైడెన్ భేటీలో ఆఫ్గనిస్తాన్ టాపిక్-తాలిబన్లకు క్లియర్ మెసేజ్-దానికి కట్టుబడి ఉండాల్సిందేనంటూ...

|
Google Oneindia TeluguNews

ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత అరాచక పాలన దిశగా అడుగులు పడుతున్న సంగతి తెలిసిందే. అన్ని వర్గాలను సమదృష్టితో చూస్తామని... అందరికీ రక్షణ,హక్కులు కల్పిస్తామని ప్రకటించిన తాలిబన్లు... ఆ మాటను నిలబెట్టుకోవట్లేదు. ముఖ్యంగా మహిళల విషయంలో అణచివేతను రోజురోజుకు తీవ్రం చేస్తున్నారు. ప్రభుత్వంలో వారికి ప్రాతినిధ్యం ఇవ్వకపోగా... వారిని విద్య,ఉద్యోగాలకు దూరం చేసి ఇంటికే పరిమితం చేసే చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్లకు భారత్-అమెరికా కీలక సూచన చేశాయి.

మోదీ-బైడెన్.. ఆఫ్గనిస్తాన్ టాపిక్...

మోదీ-బైడెన్.. ఆఫ్గనిస్తాన్ టాపిక్...


శుక్రవారం(సెప్టెంబర్ 24) భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయిన సందర్భంగా... ఆఫ్గనిస్తాన్ అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు తాలిబన్లకు స్పష్టమైన సందేశం పంపించారు. ఆఫ్గనిస్తాన్‌లో మహిళలు,చిన్నారులు,మైనారిటీలు సహా అందరి హక్కులను తాలిబన్లు గౌరవించాలని సూచించారు. అంతేకాదు,ఆఫ్గనిస్తాన్ మరోసారి ఉగ్రవాదుల అడ్డాగా మారవద్దని పేర్కొన్నారు. ఆఫ్గన్ కేంద్రంగా ఇతర దేశాలకు ముప్పు తలపెట్టే ఉగ్ర కార్యకలాపాలకు తావు ఉండకూడదన్నారు. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చేసిన తీర్మానం 2593(2021)కి తాలిబన్లు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు.

భయపడినంతా జరుగుతోంది-ఆఫ్గన్ మహిళలపై తాలిబన్ సర్కార్ మరో పిడుగు-అణచివేతను మరింత తీవ్రం చేసేలాభయపడినంతా జరుగుతోంది-ఆఫ్గన్ మహిళలపై తాలిబన్ సర్కార్ మరో పిడుగు-అణచివేతను మరింత తీవ్రం చేసేలా

గతంలోనే ఐరాస భద్రతామండలిలో తీర్మానం...

గతంలోనే ఐరాస భద్రతామండలిలో తీర్మానం...

ఈ ఏడాది ఆగస్టులో భారత్ అధ్యక్షతన జరిగిన ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఆఫ్గనిస్తాన్‌కు సంబంధించి 2593 తీర్మానాన్ని ఆమోదించారు. ఆఫ్గన్ ఉగ్రవాద స్థావరంగా మారవద్దని... ఇతర దేశాలపై దాడులకు పాల్పడే ఉగ్రవాద శక్తులకు కేంద్రంగా ఉండవద్దని అందులో పేర్కొన్నారు. తాజాగా భారత్-అమెరికా ద్వైపాక్షిక సమావేశంలో ఇదే అంశంపై చర్చించారు. ఆఫ్గన్‌లో అన్ని వర్గాల ప్రజలకు భద్రత కల్పించడంతో పాటు... అక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్లాలనుకునే ఆఫ్గన్లు,విదేశీయులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని పేర్కొన్నారు.ప్రస్తుతం సంక్షోభం దిశగా సాగుతున్న ఆఫ్గనిస్తాన్‌కు మానవతాదృక్పథంతో ఆర్థిక సహాయం అందించేందుకు ఐరాస సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే.అయితే ఈ క్రమంలో ఆఫ్గన్‌కు చేయూతనిచ్చే సంస్థలకు పూర్తి రక్షణ కల్పించేలా,ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా తాలిబన్లు చర్యలు తీసుకోవాలని భారత్,అమెరికా కోరాయి.

ఆఫ్గన్‌లో మహిళలపై తాలిబన్ల అరాచకం-వంట సరిగా వండలేదని సజీవ దహనం-సెక్స్ బానిసలుగా యువతుల తరలింపుఆఫ్గన్‌లో మహిళలపై తాలిబన్ల అరాచకం-వంట సరిగా వండలేదని సజీవ దహనం-సెక్స్ బానిసలుగా యువతుల తరలింపు

మహిళలపై పెరుగుతున్న అణచివేత

మహిళలపై పెరుగుతున్న అణచివేత


ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు ఇస్లామిక్ ఎమిరేట్స్ ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత దేశంలో ఇక ప్రజాస్వామ్యానికి తావు లేదని తేల్చి చెప్పేశారు. 33 మంది మంత్రులతో ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వంలో తాలిబన్లు,హక్కానీ నెట్‌వర్క్ ఉగ్రవాదులకు తప్ప మరో వర్గానికి చోటు దక్కలేదు.ఇక మహిళల సంగతి సరేసరి.మహిళలంటే కేవలం పిల్లలను కనడానికి మాత్రమే అనే భావన తాలిబన్లలో ఇప్పటికీ బలంగా ఉన్నది.గతంలో 1996-2001 వరకు సాగిన తమ పాలనలో మహిళలను ఎంతగా అణచివేశారో... ఇప్పుడూ అంతే స్థాయిలో అణచివేత కొనసాగుతోంది. ఇప్పటికే ఆడపిల్లలను విద్యకు దూరం చేసే సంకేతాలిచ్చారు.కేవలం మగపిల్లలను మాత్రమే స్కూల్‌కు రావాల్సిందిగా ఇటీవల ఆదేశాలిచ్చారు.ప్రభుత్వ,ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసే మహిళలను బలవంతంగా ఉద్యోగాలు మానిపించి ఇళ్లకు పంపించారు. మళ్లీ ఆఫీసులకు వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.కేవలం పురుషులతో భర్తీ చేయలేని పోస్టుల్లో మాత్రమే స్త్రీలను కొనసాగించాలని నిర్ణయించినట్లు ఇటీవల కాబూల్ మేయర్ ప్రకటించారు.

ఒక్క పాకిస్తాన్ తప్ప...

ఒక్క పాకిస్తాన్ తప్ప...


తాలిబన్ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలేవీ గుర్తించేందుకు సిద్ధంగా లేదు.ఒక్క పాకిస్తాన్ మాత్రం ఆఫ్గనిస్తాన్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు తెగ ప్రయత్నిస్తోంది.తాజాగా ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాలిబన్లను ప్రపంచ దేశాలు విశ్వసించాలని కోరడం గమనార్హం. తాలిబన్లు సంస్కరణలకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. నిజానికి ఆఫ్గనిస్తాన్‌ను పూర్తిగా హస్తగతం చేసుకున్నాక ఏర్పాటు చేసిన తొలి ప్రెస్ మీట్‌లో తాలిబన్ల మాటలు కొంత ఉదారంగానే కనిపించాయి.దీంతో గతంలో తాలిబన్ల పాలనకు,ఇప్పటి తాలిబన్ల పాలనకు తేడా ఉంటుందేమోనని చాలామంది భావించారు.కానీ రోజులు గడిచేకొద్దీ వారి అసలు స్వరూపం బయటపడుతోంది.

సంక్షోభం... అంతర్యుద్ధం దిశగా

సంక్షోభం... అంతర్యుద్ధం దిశగా

అసలే పేదరికం ఎక్కువగా ఉన్న ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు పాలన చేపట్టాక పరిస్థితులు మరింత దిగజారాయి.దేశంలో పేదరికం దాదాపు 97శాతంగా ఉన్నట్లు చెబుతున్నారు.తినడానికి తిండి కూడా దొరకని దుస్థితిలో ఆఫ్గన్ ప్రజలు అలమటిస్తున్నారు.ప్రజల వద్ద డబ్బు లేదు... ప్రభుత్వానికి విదేశాల నుంచి నిధులు అందడం లేదు.దీంతో పాలనా వ్యవస్థను సక్రమంగా నడిపించే పరిస్థితి కూడా లేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆఫ్గనిస్తాన్‌లో మళ్లీ అంతర్యుద్దం తప్పదనే వాదన వినిపిస్తోంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్),వరల్డ్ బ్యాంక్ ఇప్పటికే ఆఫ్గనిస్తాన్‌కు రుణాలు మంజూరు చేయడం నిలిపివేసింది.తాలిబన్లు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఐఎంఎఫ్ ఈ ఆంక్షలు విధించింది.అటు అమెరికా ఆఫ్గనిస్తాన్ సెంట్రల్ బ్యాంకులో 9.4బిలియన్ డాలర్ల నిధులను నిలిపివేసింది. తాలిబన్లను బ్లాక్ లిస్టులో పెట్టాల్సిందిగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) 39 మంది సభ్య దేశాలను ఆదేశించింది.దీంతో తాలిబన్ ప్రభుత్వానికి నిధుల కొరత ఏర్పడింది. అందుకే ఆఫ్గనిస్తాన్ బ్యాంకుల నుంచి కేవలం 200డాలర్లను విత్‌డ్రా లిమిట్‌గా విధించింది.ఇప్పటికే పలు బ్యాంకులు మూతపడగా... కొన్ని బ్యాంకుల ముందు జనాలు భారీ ఎత్తున బారులు తీరి కనిపిస్తున్నారు.

మానవతా దృక్పథంతో స్పందించిన ఐరాస

మానవతా దృక్పథంతో స్పందించిన ఐరాస

ఈ నేపథ్యంలో మానవతా దృక్పథంతో ఆఫ్గన్ సంక్షోభ నివారణకు 1బిలియన్ డాలర్లను ఆర్థిక సాయంగా అందించనున్నట్లు ఐరాస ప్రకటించింది.తాలిబన్ల ఆశలన్నీ ఇప్పుడా నిధుల పైనే ఉన్నాయి. ఆ నిధులు తమకు అందితే పేద ఆఫ్గన్ ప్రజలను ఆదుకుంటామని తాలిబన్లు చెబుతున్నారు.ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకుతో పాటు ఐడీబీ నుంచి నిధుల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ బ్యాంకులు తాలిబన్లకు నిధులు ఇవ్వడం అసాధ్యంగానే కనిపిస్తోంది.

English summary
On Friday (September 24), during the meeting of Indian Prime Minister Narendra Modi with US President Joe Biden, the issue of Afghanistan came up for discussion. The prime ministers of the two countries sent a clear message to the Taliban on the occasion. They called on the Taliban to respect the rights of all, including women, children and minorities, in Afghanistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X