జేడీ వాన్స్ అవుట్..? ట్రంప్ ఊహించని షాక్..??
పశ్చిమాసియాలో దాదాపు 40 రోజులుగా సాగిన యుద్ధానికి తెరదించుతూ ఇరాన్- అమెరికా మధ్య తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇరాన్ తో ఒప్పందం కుదుర్చుకునేందుకు విధించిన డెడ్ లైన్ ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు వారాలపాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు ఇరాన్ పై దాడులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇరాన్ పంపిన 10 పాయింట్ల ప్రతిపాదనకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అటు ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి ఓకే చెప్పింది. ఇక అంతకుముందు రోజు ట్రంప్.. హర్మూజ్ జలసంధిని తెరవకపోతే ఈ రాత్రితో ఇరాన్ నాగరికత మొత్తం అంతమైపోతుందని హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఇక ప్రస్తుతం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్- అమెరికా మధ్య రెండో దశ శాంతి చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇరాన్ తో చర్చల్లో భాగంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కు ట్రంప్ పెద్ద బాధ్యతే ఇచ్చారు. ఇరాన్ తన అణు కార్యక్రమాలు అన్నింటినీ తక్షణమే ఆపివేయడం అలాగే యూరేనియం శుద్ధిని, బాలిస్టిక్ మిసైల్స్ ను వినియోగించకుండా ఒప్పించేందుకు వాన్స్ ను పంపించారు ట్రంప్. రాజకీయంగా జేడీ వాన్స్ కు ఇది చాలా క్లిష్టమైన పరీక్ష అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. జేడీ వాన్స్ కు ఆయన పెట్టిన షరతు ప్రాధాన్యం సంతరించుకుంది. 'ఇరాన్ తో శాంతి ఒప్పందం కుదిరితే ఆ క్రెడిట్ మొత్తం నాకే దక్కుతుంది.. ఒకవేళ చర్చలు విఫలమైతే ఆ పరిణామాలకు జేడీ వాన్స్ బాధ్యత వహించాల్సి ఉంటుంది' అని ట్రంప్ స్పష్టం చేసినట్లు సమాచారం.
అయితే ఇరాన్- అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలం అయితే జేడీ వాన్స్ తన పదవిని కోల్పోయే ప్రమాదం ఉందని ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే డెమోక్రాట్స్, కొందరు రిపబ్లికన్ నేతలు మాత్రం అమెరికా రాజ్యాంగంలోని 25వ రాజ్యాంగ సవరణను ఉపయోగించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను తొలగించి.. వాన్స్ ను బాధ్యతలు చేపట్టాలను డిమాండ్ చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం హార్మూజ్ జలసంధి తెరుచుకుంది. టోల్ ఫీజులు చెల్లించి నౌకలు జలసంధిని దాటుతున్నాయి. కానీ రియల్ ఛాలెంజ్ ఇప్పుడు మొదలైంది. ఇరాన్ తో డైరెక్ట్ గా చర్చల్లో పాల్గొంటారు జేడీ వాన్స్. ఇస్లామాబాద్ లో శుక్రవారం ఈ చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ తో చర్చల ఫలితం పైనే జేడీ వాన్స్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది.
-
బాంబుల వర్షం... 10 నిమిషాల్లో 100 వైమానిక దాడులు -
US-Iran Ceasefire: ఇరాన్ సీజ్ ఫైర్ ను చెడగొట్టిన ఇజ్రాయెల్.. ! ట్రంప్ వాట్ నెక్ట్స్ ? -
అమెరికా-ఇరాన్ సీజ్ ఫైర్ మధ్యవర్తి పాక్ కాదా ? అసలు బ్రోకర్ ఎవరంటే ? -
పాకిస్తాన్ ప్రధాని చుట్టూ -
Iran War: సీజ్ ఫైర్ బ్రేక్-మళ్లీ హార్ముజ్ మూసేసిన ఇరాన్..! -
లీటర్ పెట్రోల్ కేవలం 3 రూపాయలకే.. మీకు కావాలా ?? -
ఇరాన్ పోరాటం భారత్ కు నేర్పుతున్న పాఠం..! టీఎంసీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..! -
US Iran: గెలుపు ఎవరిది? అసలు ఇస్లామాబాద్‌లో ఏం జరగబోతోంది? -
బట్టబయలవుతున్న పాకిస్థాన్ కుట్ర బుద్ధి.. "కీలుబొమ్మ"గా మారిందా ?? -
జాక్ పాట్ కొట్టిన భారత్.. భారీగా బయటపడ్డ చమురు నిక్షేపాలు.. 19 బావుల్లో.. -
"యుద్ద చరిత్ర తిరగరాసిన ఇరాన్"-జనసేన నేత ప్రశంసలు..! -
కోడిగుడ్డు అక్షరాల రూ.25 వేలు..?












Click it and Unblock the Notifications