US-Iran Talks: అమెరికాతో చర్చల్లో ఇరాన్ కు తొలి విజయం..! బంపర్ ఆఫర్..!
ఇరాన్ (Iran)పై యుద్ధం విఫలమై కాల్పుల విరమణ ప్రకటించిన అమెరికా ఇవాళ పాకిస్తాన్ తో ఆ దేశంతో చర్చలు (US-Iran Talks) ప్రారంభించింది. ఇందులో భాగంగా ఓ ప్రైవేటు హోటల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం, ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో చర్చలు ప్రారంభించింది. ఈ చర్చల్లో హార్ముజ్ జలసంధిని తెరుస్తున్నందుకు ఇరాన్ కు అమెరికా బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ఖతార్ తో పాటు ఇతర విదేశీ బ్యాంకులలో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడానికి ఇవాళ చర్చల్లో అమెరికా అంగీకరించింది. ఇస్లామాబాద్‌లో కొనసాగుతున్న చర్చలలో ఇది ఒక ముఖ్యమైన పురోగతిగా భావిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని అమెరికా ఇంకా ధృవీకరించాల్సి ఉంది. శాశ్వత కాల్పుల విరమణ కోసం జరుపుతున్న ఈ చర్చల్లో ఇరువర్గాలు తమ ప్రతిపాదనల్ని పరస్పరం పంచుకున్నాయి.

ఇందులో ఇరాన్ హార్ముజ్ జలసంధిని తెరవడంతో పాటు శాశ్వత కాల్పుల విరమణ కోసం తమపై గతంలో విధించిన ఆర్ధిక ఆంక్షల ఉపశమనం, నిలిచిపోయిన బిలియన్ల డాలర్ల నిధుల విడుదల కోసం అమెరికా మీద ఒత్తిడి తెచ్చింది. దీంతో విదేశాల్లో ఉన్న 6 బిలియన్ డాలర్ల ఇరాన్ ఆస్తులు విడుదల చేస్తారు. దీంతో యుద్ధంతో భారీగా దెబ్బతిన్న ఇరాన్ పునర్ నిర్మాణానికి ఈ నిధులు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ఇరాన్ ఆస్తుల విడుదలకు ప్రతిగా హార్ముజ్ ను తమ నౌకల రాకపోకలకు తెరవడంతో పాటు అణ్వాయుధాలు తయారుచేయబోమన్న హామీని అమెరికా కోరుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications