రెండు నౌకలు ఢీ: ఏడుగురి గల్లంతు

Posted By:
Subscribe to Oneindia Telugu

టోక్యో: జపాన్‌కు చెందిన ఇజు ద్వీపకల్పానికి సమీపంలో పసిఫిక్ మహా సముద్రంలో రెండు నౌకలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు నౌకాదళ సిబ్బంది గల్లంతయ్యారు.

అమెరికా నౌకా దళానికి చెందిన ఫిట్జ్ గెరాల్డ్ యుద్ధనౌక ఒక సరుకు రవాణా నౌకను ఢీకొట్టింది. దీంతో ఆ నౌకలోని కొంతభాగం దెబ్బ తినడంతో పాటు ఏడుగురు సిబ్బంది గల్లంతయ్యారు.

US sailors missing after Navy destroyer collision off Japan

గల్లంతయిన వారి కోసం అమెరికా, జపాన్ దేశాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. యుధ్ధ నౌకను ఢీకొన్న ఏఎస్ఎక్స్ క్రిస్టల్ అనే సరుకు రవాణా నౌక ఫిలిప్పీన్స్‌కు చెందినది.

ఇది టోక్యో నుండి నగోయో రేవుకు వెయ్యి కంటెయినర్లను మోసుకెళుతోంది. ప్రమాదానికి ఈ నౌకనే కారణమని జపాన్ వార్తా సంస్థలు పేర్కొనగా, దానిని నౌక కెప్టెన్ ఖండించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Seven US sailors are missing and the commanding officer of a US destroyer is among the injured after the warship and a merchant ship collided off the coast of Japan, the US Navy said.
Please Wait while comments are loading...