రెండు వారాలు ఆగండి ఆసక్తికర విషయాలను చెబుతా, ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: 'రెండు వారాలు ఆగండి..అద్భుతమైన ఆసక్తి కలిగించే విషయాలు చాలా చెబుతాను' అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ట్రంప్ టవర్స్ పై అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా వైర్ ట్యాపింగ్ కు పాల్పడ్డాడనే ఆరోపణలపై ట్రంప్ బాంబు పేల్చనున్నారని సమాచారం.

ట్రంప్ టవర్స్ పై వైర్ ట్యాపింగ్ జరిగిందని తాను చేసిన ఆరోపణలకు సాక్ష్యాధారాలను త్వరలోనే ఇంటలిజెన్స్ పై హౌస్ పర్మినెంట్ సెలెక్ట్ కమిటీకి సమర్పిస్తానని ఓ టీవి చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వచ్చే వారమే ఆసక్తికర విషయాలను తాను చెప్పే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

సాక్ష్యాలను సమర్పించడానికి కంటే ముందే ఫోన్ ట్యాప్ ఆరోపణల గురించి ఎందుకు ట్వీట్ చేశారన్న ప్రశ్నకు ట్రంప్ స్పందించారు. తాను చెప్పిన వైర్ ట్యాపింగ్ ఆర్థ పరిధిలోకి అనేక విషయాలు వస్తాయన్నారు.,

Very Interesting Items’ Will Come To Light ‘Over The Next Two Weeks’

నిఘా, తదితర చాలా అంశాలు దీనిలో ఉన్నట్టు చెప్పారు. తన ట్వీట్ లో వైర్ ట్యాప్ డ్ అంటూ కోట్స్ లో ఉన్న పదాల గురించి ఎవరూ మాట్లాడడం లేదన్నారు. కానీ, ఈ పదాలకు ప్రత్యేక ఆర్థాలున్నాయని ట్రంప్ చెప్పారు.

అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ టవర్స్ పై వైర్ ట్యాపింగ్ కు అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశించినట్టుగా ట్రంప్ ఆరోపణలు గుప్పించారు.అయితే ఈ ఆరోపణలను ఒబామా ఖండించారు.అయితే ఈ విషయమై రెండువారాల్లో వాస్తవాలను బయటపెడతానని ట్రంప్ ప్రకటించడం సంచలనంగా మారింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Very Interesting Items’ Will Come To Light ‘Over The Next Two Weeks’President Donald Trump sat down for an interview with Fox News’ Tucker Carlson in Detroit, Michigan on Wednesday, in which POTUS touched on a wide range of topics.
Please Wait while comments are loading...