ట్రంప్ చుట్టూ ఉచ్చు: మెలానియాను తాకిన వాషింగ్టన్ అల్లర్ల సెగ: ఖాళీ అవుతోన్న వైట్‌హౌస్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఒక్కసారిగా రాజకీయ పరిస్థితులు పతాక స్థాయికి చేరుకున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు ఆ దేశ పార్లమెంట్ భవనాన్ని ముట్టడించిన తరువాత.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులు పార్లమెంట్ భవనాన్ని ముట్టడించడం, సమావేశాలను భగ్నం చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్న ప్రభావం వైట్‌హౌస్‌పై పడింది. అమెరికా అధ్యక్ష భవనం ఖాళీ అవుతోంది. కీలక స్థానాల్లో ఉన్న అధికారులు రాజీనామాల బాట పట్టారు.
అనూహ్యంగా పరిణామాలతో డొనాల్డ్ ట్రంప్ క్యాంప్.. ఉక్కిరిబిక్కిరికి గురవుతోంది. ఉద్వాసన ఉచ్చు బిగుసుకుంటోంది.
తాజాగా అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌కు వాషింగ్టన్ అల్లర్ల సెగ తగిలింది. ఆమె కార్యాలయాల్లో వేర్వేరు విభాగాల్లో పనిచేసే ఉన్నతాధికారులు ఒక్కరొక్కరుగా రాజీనామాలు చేస్తున్నారు. మెలానియా ట్రంప్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టెఫానీ గ్రీషం రాజీనామా చేశారు. ఆమె వైట్‌హౌస్ సోషల్, ప్రెస్ సెక్రెటరీగా కూడా పనిచేస్తున్నారు. వాషింగ్టన్‌లో అల్లర్లు చోటు చేసుకున్న కొన్ని నిమిషాల వ్యవధిలోనే స్టెఫానీ తన హోదాకు గుడ్‌బై చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల చర్యలకు నిరసనగా ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసంలో ఇన్నాళ్లు పనిచేయడం.. తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఆమె వ్యాఖ్యానించారు. డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్ హయాంలో వైట్‌హౌస్‌లో కీలక పదవిలో కొనసాగడం తనకు గర్వకారణమని చెప్పారు. వారి సారథ్యంలో తాను చిన్నపిల్లలకు మెరుగైన ప్రమాణాలను కల్పించడానికి కృషి చేశానని పేర్కొన్నారు. కొన్ని కారణాల వల్ల రాజీనామా చేయాల్సి వస్తోందని చెప్పారు. ఆ కారణాలేమిటనేది స్టెఫానీ వివరించలేదు. వాషింగ్టన్‌లో అల్లర్లు చెలరేగిన కాస్సేపటికే హోదా నుంచి వైదొలగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
It has been an honor to serve the country in the @WhiteHouse . I am very proud to have been a part of @FLOTUS @MELANIATRUMP mission to help children everywhere, & proud of the many accomplishments of this Administration. Signing off now - you can find me at @OMGrisham ❤️🇺🇸
— Stephanie Grisham (@StephGrisham45) January 7, 2021
Recommended Video
2016లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తొలి రోజుల్లోనే ఆమె వైట్‌హౌస్‌లో చేరారు. అప్పటి నుంచి మెలానియా ట్రంప్.. చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా, వైట్‌హౌస్ సోషల్, ప్రెస్ సెక్రెటరీగా పని చేస్తున్నారు. గత ఏడాది ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లోనూ ఆమె డొనాల్డ్ ట్రంప్ తరఫున ఎన్నికల ర్యాలీల్లో విస్తృతంగా పాల్గొన్నారు. ప్రెస్ సెక్రెటరీగా వ్యవహరించినప్పటికీ.. ఇప్పటిదాకా ఆమె విలేకరుల భేటీని ఏర్పాటు చేయలేదు. పూర్తి సమయాన్ని మెలానియా ట్రంప్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హోదాకే కేటాయించారు.
-
పర్షియన్ గల్ఫ్ దేశాన్ని తుడిచి పెడతాం- ఇంకో రెండు, మూడు వారాలే: తేల్చి చెప్పిన ట్రంప్ -
ఆ నినాదంతో బలంగా.. ట్రంప్ బాటలో కవిత! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్‌తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే!












Click it and Unblock the Notifications