జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొప్పులను డిప్యూటీ సీఎం చేయండి.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సజెషన్

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దళితులకు మంత్రి పదవీ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. బాల్క సుమన్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే దీంతోపాటు డిప్యూటీ సీఎం పదవీ కూడా ఒక దళితుడికి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అందులో కొప్పుల ఈశ్వర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొప్పులను డిప్యూటీ సీఎం చేయాలని కోరడం అంటే మెప్పు కోసం కాదు.. ఆయన నిర్లక్ష్యం వీడాలని సూచించారు. ఇండెరెక్టుగా.. సెటైర్లు వేసి మరీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు రిక్వెస్ట్ చేశారు. యథా రాజా.. తథ ప్రభు అన్న విధంగా క్యాబినెట్ ఉందనే కామెంట్స్ చేశారు.

pls..promote koppula eshwar to deputy cm

మంత్రిగా ఉన్నప్పుడు ప్రసంగాలే కాదు పథకాలపై పర్యవేక్షణ ఉండాలని జీవన్ రెడ్డి సూచించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ తన నిర్లక్ష్యం వీడాలని చెప్పారు. ఇటు సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. దళితుల నిధులను దారి మళ్లించి దళిత ద్రోహిగా మిగిలారని మండిపడ్డారు. ఇవాళ కేసీఆర్ దళిత బంధు పథకం లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొత్త ఉద్యోగాలు ఇవ్వడం ఏమో కానీ ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ సాధించుకున్నది.. ఇందుకోసమేనా అని ప్రశ్నించారు.

ప్రభుత్వ దళిత ఉద్యోగులకు దళితబంధును వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. హుజూరాబాద్ వేదికగా దళితబంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పథకం అమలు తీరును వివరించారు. హుజూరాబాద్‌లో ఉన్న‌ ప్ర‌తి ఒక్క ద‌ళిత కుటుంబానికి రెండు నెల‌ల్లో డ‌బ్బులు అందజేస్తామన్నారు. హుజూరాబాద్ కాడ అంద‌రికీ ఎందుకు ఇస్తారంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప‌థ‌కం అమ‌లు చేయాలన్నారు. 25 ఏళ్ల కింద సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న‌ సమయంలో.. సిద్దిపేట ద‌ళిత చైత‌న్య జ్యోతి అని ప్రారంభించామని వివరించారు. ఇది ఇవాళ్టి కొత్త దుకాణం కాదు. అప్పుడే పాట‌లు రూపొందించామని చెప్పారు. గత 25 ఏళ్ల నుంచి తన మెదడులో ఉందన్నారు. ప్ర‌పంచంలో అణ‌గారిన, అణిచివేయ‌బ‌డ్డ జాతులు ఎన్నో ఉన్నాయని వివరించారు. దేశంలో ద‌ళితుల మాదిరిగా ప్ర‌పంచ వ్యాప్తంగా 165 జాతులు సామాజిక వివ‌క్ష‌కు గుర‌య్యాయని చెప్పారు. అంబేద్క‌ర్ పోరాటం వ‌ల్ల అన్ని ప‌ద‌వుల్లో రిజ‌ర్వేష‌న్లు, ఉద్యోగ అవ‌కాశాలు ల‌భించాయని సీఎం అన్నారు.

English summary
pls..promote koppula eshwar to deputy cm mlc jeevan redd asked cm kcr. than he criticized government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X