జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ వాన: రెండు రోజులు, ఈదురుగాలులతో జనం ఉక్కిరి బిక్కిరి

|
Google Oneindia TeluguNews

వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. గత శుక్రవారం (8వ తేదీ) నుంచి వాన పడుతూనే ఉంది. మధ్యలో రెండురోజులు గ్యాప్ ఇచ్చి.. మళ్లీ పడుతుంది. అల్పపీడన ప్రభావంతో వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మరో రెండురోజులు ఆదివారం, సోమవారం కూడా తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయ్యింది.

ఉత్తర, దక్షిణ తెలంగాణ

ఉత్తర, దక్షిణ తెలంగాణ

రుతుపవనాల ప్రభావంతో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, వరంగల్ రూరల్, మహబూబాబాద్, ఆసిఫాబాద్,మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. జగిత్యాల జిల్లాలో ఉదయం నుంచే వర్షం కురుస్తోంది. ఉదయం తేలికపాటి జల్లులు కురవగా.. మధ్యాహ్నం వాన దంచికొట్టింది.

సోమవారం ఇక్కడ

సోమవారం ఇక్కడ

సోమవారం భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, సిరిసిల్ల, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, పెద్దపల్లి, ములుగు జిల్లాలో వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో ఈసారి నైరుతి రుతుపవనాలు అనుకున్న స‌మ‌యం కంటే ముందుగానే వ‌చ్చేశాయి. నైరుతి రుతుపవ‌న మెఘాలు రాష్ట్రవ్యాప్తంగా విస్త‌రించి ఉన్నాయి దీంతో తెలంగాణ‌లో మే చివ‌రి వారం నుంచే కొన్ని ప్రాంతాల్లో వ‌ర్షాలు ప‌డ‌డం ప్రారంభించాయి.

జలకళ

జలకళ


ఇక ఇప్పటికే తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు వంకలు ప్రమాదకరంగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటితో ప్రాజెక్టులు, జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా మారి ప్రమాదకరంగా మారాయి. చాలా చోట్ల చెరువు కట్టలు తెగిపోయాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కొత్త వారు ఆ వైపుగా వెళ్లొద్దని స్థానికులు సమాచారం ఇస్తున్నారు. వర్షాలతో నారు నీట మునిగిపోయింది. అన్నదాతకు కన్నీరు తెప్పిస్తోంది. మరికొన్ని చోట్ల పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి.

English summary
Rain alert:Rain alert:rain lashes in telangana state and jagtial district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X