మోసం, వంచన కేసీఆర్ నైజం: ఈటల రాజేందర్ విసుర్లు
హుజురాబాద్ బై పోల్ వేళ అటాక్- కౌంటర్ అటాక్ కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. ఉద్యమ సమయంలో దళితుడినే తొలి ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ చెప్పారని... మాట తప్పను అని అందరినీ నమ్మించారని గుర్తుచేశారు. మాట తప్పితే తల నరుక్కుంటానని అన్నారని... చివరకు ఆయనే గద్దెనెక్కారని ఈటల విమర్శించారు.

గంజిలో ఈగ లాగా
దళితులను అవమానించిన చరిత్ర కేసీఆర్‌ది అని, గంజిలో ఈగ మాదిరిగా దళితులను తీసి పారేశారని చెప్పారు. దళితులను ఎప్పుడూ మోసం చేస్తూనే వచ్చారని, సబ్సిడీ రుణాలు, డబుల్ బెడ్రూమ్ లు ఇవ్వలేదని అన్నారు. ఇప్పుడు దళితబంధుతో మళ్లీ మోసం చేసేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. దళితబంధు పథకాన్ని ఎవరో ఆపుతున్నారంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఈటల రాజేందర్ దుయ్యబట్టారు.

అభ్యంతరం లేదు
దళితబంధును ప్రతి దళితుడికీ ఇవ్వాలని తాను కోరుతున్నానని చెప్పారు. దళితబంధును ఎవరూ వద్దనడం లేదన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక వల్లే రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు ఉన్నవాళ్లకు కూడా ఇళ్లు కట్టుకునే జీవోలు వస్తున్నాయని చెప్పారు. ఎన్నికలు ఉంటేనే హామీలు, చెక్కులు ఇస్తారని, లేకపోతే ఇవ్వరని.. ఇదే కేసీఆర్ నైజమని దుయ్యబట్టారు. ఈ నెల 30 తర్వాత స్థానిక టీఆర్ఎస్ నేతల బతుకులు బజారుపాలేనని చెప్పారు.

విక్టరీ
హుజురాబాద్‌లో విజయం టీఆర్ఎస్- బీజేపీకి తప్పనిసరి. గెలుపు కోసం ఆ రెండు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అధికార పార్టీకి విజయం కంపల్సరీ.. లేదంటే మొహం చూపించుకునే పరిస్థితి ఉండదు. ఇక బీజేపీ పరిస్థితి అయితే మరీ దారుణం.. పార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మాత్రం జీవన్మరణ సమస్యే.. ఎందుకంటే ఆయన ఓడిపోతే రాజకీయంగా కోలుకోలేని దెబ్బ.. ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరీ హుజురాబాద్ ప్రజలు ఏం తీర్పు చెప్పనున్నారో చూడాల్సిందే

ఆగిన పథకం
హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ. కానీ ఈసీ దళితబంధు పథకానికి బ్రేక్ ఇచ్చింది.