కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

3 షాపింగ్ మాల్స్‌కు బాంబ్ బెదిరింపు.. ఎక్కడ అంటే

|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌లో బాంబు కలకలం రేగింది. మూడు షాపింగ్ మాల్స్‌లో ఓకేసారి బాంబ్ ఉందనే సమాచారం వచ్చింది. దీంతో షాపింగ్ మాల్ సిబ్బంది ఆందోళన చెందారు. మైక్ ద్వారా అనౌన్స్ చేయడంతో.. షాపులో ఉన్న వారు ఉరుకులు పరుగులు తీశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి పరిశీలించారు. అయితే బాంబ్ ఏమీ లేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

సౌత్ ఇండియా, మాంగళ్య, వీఆర్కే సిల్స్ మాల్స్‌కు బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే యాజమాన్యం అలర్ట్ అయ్యింది. పోలీసులు వచ్చి సోదాలు నిర్వహించారు. బాంబ్ ఏమీ లేదని నిర్ధారించడంతో రిలాక్స్ అయ్యారు. అయితే ఓ ఆకాతాయి ఫోన్ చేసినట్టు గుర్తించారు. ఫోన్ నంబర్ ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతను ఎవరు..? ఎందుకు కాల్స్ చేశారనే అంశం పోలీసుల విచారణలో తేలనుంది.

bomb threatening call to 3 shopping malls at karimnagar

ఇటీవల బాంబ్ బెదిరింపు కాల్స్ ఎక్కువగానే వస్తున్నాయి. అయితే మెట్రో సిటీల్లో వచ్చేవి. కానీ కరీంనగర్ లాంటి టైర్-2 నగరాలకు కూడా బెదిరింపు రావడం కలకలం రేపుతుంది. ఈ మధ్య నేషనల్ ఫెస్టివ్స్ ఏమీ లేవు.. అయినప్పటికీ ఉగ్రవాద కదలికలపై నిఘా పెడుతూనే ఉంటారు. ఏ చిన్న కాల్ చేసినా.. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉంటారు. అందుకే కరీంనగర్ ఫోన్ కాల్ అంశాన్ని కూడా సీరియస్‌గా తీసుకున్నారు.

English summary
bomb threatening call to three shopping malls at karimnagar city. police teams are checked but call is fake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X