• search
 • Live TV
నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో ఎవరైతే ఓకే.. తన, కుమారుడా..? పీకే టీమ్‌తో జానారెడ్డి సర్వే..?

|
Google Oneindia TeluguNews

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలిచేందుకు ప్రధాన పార్టీలు వ్యుహాలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. అభ్యర్థులు కూడా రంగంలోకి దిగారు. సాగర్ కాంగ్రెస్ కంచుకోట.. అయితే గత ఎన్నికల్లో సీనియర్ నేత జానారెడ్డిని నోముల నరసింహయ్య మట్టికరిపించారు. నోముల ఆకాల మరణంతో సాగర్ ఎన్నిక అనివార్యమయ్యింది. ఉప ఎన్నికలో జానారెడ్డి బరిలోకి దిగుతారనే ప్రచారం జరిగింది. ఆయనకు బదులు కుమారుడిని పోటీ చేయించాలని జానా.. భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

Recommended Video

  Sonia Gandhi Agrees To Janareddy's Request Over PCC Chief Announcement | Oneindia Telugu
  టాటా.. బైబై, గుడ్ బై..

  టాటా.. బైబై, గుడ్ బై..


  ఇటీవల కాంగ్రెస్ పార్టీలో కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. జానారెడ్డి ప్రధాన అనుచరులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. వారంత బీజేపీలోకి వెళుతుండటం చర్చకు దారితీసింది. దీంతో జానారెడ్డి రూటు మార్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో తన తర్వాత ఉన్న సీనియర్ నాయకులు పోటీలో నిలబడితే తనకు అభ్యంతరం లేదని చెప్పారు. దీంతోపాటు అన్ని అర్హతలు ఉన్న కుమారుడు రఘువీర్‌రెడ్డిని ఆమోదిస్తే పార్టీ తరఫున నిలబెడతానని తన మనసులో మాట బయటపెట్టారు.

  గ్రౌండ్ లెవల్ సర్వే

  గ్రౌండ్ లెవల్ సర్వే

  నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవల్‌లో సర్వే చేయిస్తోంది. క్యాడర్‌తో బిజీబిజీగా గడుపుతూ కొత్త కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. సాగర్‌లో గల తన నివాసంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. జానారెడ్డి ఇప్పటికే రెండు సార్లు తన కుమారుడిని ఎమ్మెల్యే చేయాలని భావించిన సమయం అనుకూలించలేదు. గతంలో మిర్యాలగూడ టిక్కెట్‌ ఇచ్చి ఎమ్మెల్యే చేయాలని భావించినా కుదరలేదు. తర్వాత సాగర్‌లో పోటీ చేయించాలని కూడా ప్రయత్నించారు. కుమారుడి రాజకీయ భవిష్యత్‌కి గట్టి పునాది వేయాలని జానారెడ్డి ఆతృత పడుతున్నారని ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది.

  పీకే టీం సర్వే..

  పీకే టీం సర్వే..

  నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో ప్రశాంత్ కిశోర్ టీమ్‌తో జానారెడ్డి సర్వే చేయిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. జానారెడ్డి / కుమారుడు రఘువీర్‌రెడ్డిలో ఎవరు నిలబడితే బాగుంటుందని సర్వేలు చేయిస్తున్నారని సమాచారం. అధిష్టానాన్ని ఒప్పించి రఘువీర్‌ను ఉప ఎన్నికల్లో బరిలోకి దింపాలని జానారెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారని సమాచారం. సాగర్ నియోజకవర్గంలో తొలుత నిడమనూరు మండలం ఆభంగపురం గ్రామం నుండి ప్రచారం ప్రారంభించడం జానారెడ్డికి ఆనవాయితీగా వస్తోంది. రఘువీర్‌తో వారం రోజుల క్రితమే అక్కడి నుంచి పార్టీలో చేరికలు, ప్రచారం వంటి కార్యక్రమాలు చేపట్టారు. హాలియా మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి రఘువీర్ పోటీ చేస్తారనే సంకేతాలు ఇచ్చారు.

  గెలిపించాలని..

  గెలిపించాలని..


  సాగర్‌ ఉపఎన్నికలో రఘువీర్‌ని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి.. గెలిపించుకునేందుకు జానారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. రఘువీర్‌రెడ్డితోపాటు మరో కుమారుడు జయవీర్‌రెడ్డి కూడా సాగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను చుట్టేశారు. సాగర్‌లో నివాసమున్నా నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండలేకపోతున్నానని జానారెడ్డి అనుకుంటున్నారని తెలుస్తోంది. స్వ గ్రామం అనుములలో నివాసం ఏర్పర్చుకుని ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని జానారెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది. గత ఎన్నికలలో ఓటమికి గల కారణాలను అన్వేషిస్తూ మళ్లీ తన కుమారుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకుని కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని జానారెడ్డి కసితో ఉన్నారని సమాచారం.

  English summary
  senior congress leader jana reddy ask prasanth kisore team for who will win sagar by poll nor me either son raghuveer reddy.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X