అమెరికాలా మునుగోడు.. గెలిపిస్తే పక్కా చేస్తా, ప్రచారంలో కేఏ పాల్
మునుగోడు బై పోల్ క్యాంపెయిన్ జోరందుకుంది. గెలిచేందుకు ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంది. విమర్శలు- ప్రతీ విమర్శలతో రాజకీయం మరింత హీటెక్కింది. ప్రజా శాంతి పార్టీ కూడా బరిలో ఉన్న సంగతి తెలిసిందే. గద్దర్ పోటీకి విముఖత తెలుపడంతో.. ఆ పార్టీ అధినేత కేఏ పాల్ రంగంలోకి దిగారు. ఇవాళ ప్రచారం చేసిన ఆయన.. హామీలు గుప్పించారు. మునుగోడు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

దోశ వేసిన పాల్..
స్వతంత్ర
అభ్యర్థిగా
ప్రజాశాంతి
పార్టీ
అధినేత
కే
ఏ
పాల్
నామినేషన్
దాఖలు
చేసిన
సంగతి
తెలిసిందే.
ఎన్నికల
ప్రచారంలో
పాల్
ఉత్సాహంగా
పాల్గొంటున్నారు.
బుధవారం
మునుగోడు
పరిధిలో
ఎన్నికల
ప్రచారం
చేశారు.
ఓ
హెటల్
వద్ద
దోశ
వేస్తూ
కనిపించారు.
చేతులతో
దోశను
కాలుస్తూనే...అక్కడున్న
వారితో
మాట్లాడారు.
ఎన్నికల్లో
తనకు
ఉంగరం
గుర్తును
కేటాయించారని
చెప్పారు.

ఉంగరం గుర్తు
ఉంగరం
గుర్తుకు
ఓటేస్తే
మునుగోడును
అమెరికా
మాదిరిగా
మారుస్తానని
చెప్పారు.'ఉంగరం
గుర్తుకు
ఓటేయండి,
మునుగోడును
అమెరికా
చేద్దాం'
అని
ప్రచారం
చేశారు.
పాల్
మాట్లాడుతుండగా
ఆయన
మాటలకు
అక్కడున్న
జనం
కౌంటర్లు
ఇచ్చారు.
హా
అవునా..
అమెరికా
చేద్దామా
అన్నారు.

అగ్రనేతల ప్రచారం
మునుగోడు బై పోల్‌లో విజయం.. రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నీడ్. ఆయన ఓడిపోతే రాజకీయ జీవితం దాదాపు క్లోజ్ అయినట్టే. అందుకోసమే ఆయన ప్రచారం కోసం అగ్రనేతలను దింపుతున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అతని అనుయాయులు బిజీగా ఉన్నారు. ఇటు బండి సంజయ్ టీఆర్ఎస్ పార్టీపై ఎదురుదాడి చేశారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఒక్కో ఓటుకు రూ.40 వేలు ఇచ్చేందుకు సిద్ధమైందని ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటుకు రూ.10 వేలు ఇచ్చిన టీఆర్ఎస్... హుజూరాబాద్ ఉప ఎన్నికలో రూ.20 వేలు ఇచ్చిందని ఆరోపించారు. ఇప్పుడు దానిని మరింత రెట్టింపు చేసిందని వివరించారు.