నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నోముల భగత్‌కు కరోనా.. ఫ్యామిలీకి కూడా.. ఇతర నేతలకు ఆల్ సో..

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మరి విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ ప్రభావమో ఏమో కానీ.. ఫ్యామిలీలో ఒకరికి సోకితే అందరికీ వ్యాపిస్తోంది. నాగార్జున సాగర్‌లో కరోనా పంజా విసిరింది. ఉప ఎన్నిక ప్రచారం, పోలింగ్ రోజున మహమ్మారి వేగంగా విస్తరించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల‌ భగత్‌ కరోనా సోకింది. అతని ఫ్యామిలీని కూడా వైరస్ వీడలేదు.

 nomula bhagat infected corona

మరి కొందరు టీఆర్ఎస్ నాయకులకు కూడా వైరస్ వచ్చింది. ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా కరోనా బారిన పడినట్లు తెలిసింది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఈ రోజు 160 కరోనా కేసులు నమోదయ్యాయి. ఉప ఎన్నికలో ప్రచారం చేసిన తర్వాత సీఎం కేసీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాతే ఆయనకు వైరస్ సోకడంతో.. బహిరంగ సభపై మాస్క్ లేకుండా కనిపించరనే ప్రచారం జరుగుతోంది.

Recommended Video

Nagarjuna Sagar Bypoll: BJP's Candidate Dr P Ravi Kumar - Ravindra Nayak press meet

కరోనా కేసులు పెరగడంతో ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఢిల్లీ అయితే వారం రోజులపాటు లాక్ డౌన్ విధించింది. దీంతో ఆనంద్ విహర్ బస్ స్టేషన్ వద్ద జనం బారులుతీరారు. స్వస్ధలాలకు వెళ్లేందుకు వెయిట్ చేస్తున్నారు. ఇటు తెలంగాణలో నైట్ కర్ప్యూ విధించాలని.. వీకెండ్ లాక్ డౌన్ అమలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

English summary
nagarjuna sagar trs candidate nomula bhagat infected corona virus. his family also infected virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X