గుడికని తీసుకెళ్ళి.. అడవిలో వీడియో తీస్తూ యువతిపై ఏడుగురు గ్యాంగ్ రేప్..నిజామాబాద్ లో దారుణం
నిజామాబాద్ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడిని నమ్మి గుడికి అని భావించి అతనితో కలిసి వెళ్లిన ఓ యువతిపై ఏడుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన షాక్ కు గురి చేసింది. అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అటుగా వెళ్తున్న పోలీసులు విచారించగా తీగలాగితే డొంకంతా కదిలింది. చేసిన దారుణం బయటకు వచ్చింది .

హనుమాన్ దేవాలయానికి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళి గ్యాంగ్ రేప్
సారంగాపూర్ హనుమాన్ దేవాలయానికి వెళ్దామని చెప్పి ఓ యువతిని వెంట పెట్టుకుని వెళ్లిన యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా, తన స్నేహితులు మరో ఆరుగురిని పిలిపించి యువతిని వారికి అప్పగించాడు. ఏడుగురు మానవమృగాలు పైశాచికంగా యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా, ఆమె ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు, ఆమెను బెదిరించడానికి వీడియో తీశారు. ఎవరికైనా చెప్తే ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు.

సారంగపూర్ అటవీ ప్రాంతంలో మిట్ట మధ్యాహ్నం యువతిపై అత్యాచారం
నిజామాబాద్ జిల్లా సారంగపూర్ అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ నగర శివారులోని ఓ గ్రామానికి చెందిన యువతికి ఆటో నడుపుకునే సురేష్ అనే వ్యక్తితో పరిచయమైంది. అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్న సదరు సురేష్ ప్రేమ పేరుతో ఆమెను వలలో వేసుకున్నాడు . అతన్ని బాగా నమ్మిన సదరు యువతి సారంగాపూర్ హనుమాన్ దేవాలయానికి వెళదామని సురేష్ చెప్పడంతో అతనితో కలిసి వెళ్ళింది. మిట్ట మధ్యాహ్నం సమయంలో సారంగాపూర్ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు సురేష్.

వీడియో తీసిన యువకులు .. యువతికి బెదిరింపులు
అంతేకాదు అనంతరం తన స్నేహితులను ఆరుగురిని పిలిచి సదరు మహిళను వారికి అప్పగించాడు. పైశాచికంగా ఆమెపై అత్యాచారం చేసిన ఈ గ్యాంగ్ ఆమెను రేప్ చేస్తూ వీడియో తీసుకున్నారు. ఎవరికైనా చెబితే వీడియో అందరికీ వైరల్ చేస్తామని ఆమెను బెదిరించారు.
ఇక ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయారు. వీడియో తీసిన ఇద్దరు యువకులు ఆటోని ఆపి సదరు వీడియోలు చూస్తుండగా అటువైపుగా వచ్చిన పెట్రోలింగ్ వాహనంలోని పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న వారిని ప్రశ్నించారు.

పోలీసుల విచారణలో వెలుగులోకి ఘటన .. కేసు నమోదు
పొంతనలేని సమాధానం ఇవ్వడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ సాగించ గా అసలు విషయం వెలుగులోకి వచ్చింది . అయితే తాము అత్యాచారానికి పాల్పడ్డ లేదని కేవలం మీడియా మాత్రమే తీశామని సదరు నిందితుడు పోలీసులకు చెప్పారు. అత్యాచారం భావించబడిన యువతిని తీసుకొనివచ్చి పోలీసులు ప్రశ్నించగా ఆమె తనపై ఏడుగురు అత్యాచారానికి పాల్పడినట్లు గా పోలీసులకు చెప్పింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక వీడియో తీసిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications