సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏడాదిలో సిద్దిపేటకు రైలు, వెయ్యికోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి హరీశ్ రావు

|
Google Oneindia TeluguNews

సిద్దిపేట అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సంవత్సరంలో సిద్దిపేటకు రైలు వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సిద్దిపేట 14, 28 వార్డులలో సీసీ రోడ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని పనులు చేపడుతున్నామని హరీశ్ రావు వివరించారు. తాము చేస్తున్న పనులను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

Recommended Video

ఇల్లు తాకట్టు పెట్టి రూ.45 లక్షలు..మంత్రి హరీష్ రావు మంచి మనసు..!

పట్టణంలో వంద ఏండ్ల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇంటిలో గచ్చు తరహాలో వీధిలో సీసీ రోడ్ నిర్మిస్తున్నామని చెప్పారు. ఐదేళ్లలో వెయ్యి కోట్ల అభివృద్ది పనులను చేశామన్నారు. సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. డెవలప్ మెంట్ పనులపై దృష్టిసారించామని తెలిపారు. తాము చెప్పేది చేసిన పనులేనని చెప్పారు.

train comes to siddipet within one year

హైదరాబాద్ నుంచి సిద్దిపేట రంగనాయక సాగర్‌కు వచ్చేలా అభివృద్ధి చేస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. ఇదీ పర్యాటక కేంద్రంగా విరాజిల్లనుందని చెప్పారు. మరో ట్యాంక్ బండ్‌లా మారుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యర్ధం నుండి ఇటుకలు తయారీ చేస్తామని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. తమ హయాంలో అన్నీ వర్గాలకు మేలు జరుగుతుందని చెప్పారు. అందరికీ సమానంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. ఇతర పార్టీలకు చెందినవారు అని లబ్ధిదారులకు పథకాలు ఇవ్వడం ఆపడం లేదని చెప్పారు.

English summary
train comes to siddipet within one year minister harish rao said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X