ఏ గుర్తుకు ఓటేస్తావ్ ?..మహిళ జవాబుకు అవాక్కయిన మంత్రి ధర్మాన...!
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరేందుకు అధికార వైసీపీతో పాటు విపక్ష టీడీపీ,జనసేన, బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరుణంలో నిత్యం ఆయా పార్టీల నేతల మధ్య సాగే మాటలయుద్ధంతో పాటు రాజకీయాల్ని దగ్గరి నుంచి గమనిస్తున్న సాధారణ జనం తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. మరికొందరు వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనే దానిపై క్లారిటీకి వచ్చేస్తున్నారు.
ఏ గుర్తుకు ఓటేస్తావ్ ?..మహిళ జవాబుకు అవాక్కయిన మంత్రి ధర్మాన...!#andhrapradesh, #srikakulam pic.twitter.com/QF1jVtrPrX
— oneindiatelugu (@oneindiatelugu) July 18, 2023
Recommended Video

ఇదే క్రమంలో శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పట్టణం గూనపాలేంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు షాక్ తగిలింది. ఈ కార్యక్రమానికి హాజరై తన వద్ నుంచి ధృవపత్రం తీసుకుంటున్న ఓ లబ్దిదారు మహిళను ధర్మాన వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తావని ప్రశ్నించారు. దీంతో ఆమె ఏమాత్రం తడుముకోకుండా ఓ షాకింగ్ రిప్లై ఇచ్చింది. దీంతో ధర్మాన ఒక్క క్షణం అవాక్కయ్యారు. అంతలోనే తేరుకుని పక్కనున్న వైసీపీ నేతలు, అధికారులకు ఆమె ఏం చెప్పిందో వివరించారు.

ఇంతకీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సదరు మహిళను అడిగిన ప్రశ్నేంటో తెలుసా ? ఏ గుర్తుకు ఓటేస్తావు. దీంతో సదరు మహిళ తడుముకోకుండా సైకిల్ అని చెప్పేసింది. దీంతో తాను ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యానేమో అనుకుని ధర్మాన మరోసారి ఏ గుర్తు అని ప్రశ్నించారు. దీంతో రెండోసారి కూడా ఆమె సైకిల్ అనే చెప్పేసింది. దీంతో పక్కనే ఉన్న వైసీపీ నేతలు, అధికారుల్ని ఇదిగో చూడండి ఈమె సైకిల్ గుర్తుకే ఓటేస్తుందట అంటూ ధర్మాన చెప్పారు. అక్కడితో ఆగకుండా సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఏమవుతుందో కూడా చెప్పేశారు.
సైకిల్ గుర్తుకు ఓటేస్తే తప్పులేదని, కానీ గోతిలో పడిపోతావని మాత్రమే చెబుతున్నా అంటూ మంత్రి ఆమెకు చెప్పారు.
దీంతో ఆమె కూడా మంత్రి గారికి ఏం చెప్పాలో తెలియక అక్కడి నుంచి వెళ్లిపోయింది. మంత్రి సమక్షంలోనే జరిగిన ఈ ఘటన అక్కడే ఉన్న వైసీపీ కార్యకర్తల్ని, నేతల్ని కూడా ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేసింది. అసలే ఎన్నికలు దగ్గరపడుతున్న సమయం కూడా కావడంతో సాధ్యమైనంతగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ జగనన్న సురక్ష ధృవపత్రాలు ఇస్తామంటూ జనాన్ని రప్పిస్తోంది. ఇందులో ఓ మహిళ ఇలా షాకిస్తుందని మాత్రం అక్కడున్న వారు ఊహించలేదు.












Click it and Unblock the Notifications